)
Andhra Bride Parents Kidnap: ప్రేమ వివాహం చేసుకున్న తమ అమ్మాయిని ఏపీకి చెందిన కుటుంబసభ్యులు కిడ్నాప్ చేశారు. తెలంగాణ యువకుడిని ప్రేమ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని ఏపీ యువతి కుటుంబీకులు ఎత్తుకెళ్లారు. కర్రలు.. మందీబలగంతో వచ్చిన యువతి కుటుంబసభ్యులు వరుడి కుటుంబసభ్యులను భయభ్రాంతులకు గురి చేశారు. యువతిని ఎత్తుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో దొరికాయి. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణలోని జగిత్యాల జిల్లా మల్యాలకు చెందిన యువకుడు నల్ల ముత్తుకుమార్ (27) ఏపీలోని గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన సోముల మాధవి (24)ని ప్రేమించాడు. వారం కిందట కొండగట్టులో మాధవిని ముత్తు కుమార్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. ప్రేమ వివాహం అనంతరం ఇంటికి తీసుకెళ్లాడు. అయితే వారి ప్రేమను అంగీకరించని కుటుంబసభ్యులు తమ అమ్మాయిని ఎలాగైనా తీసుకెళ్లాలని నిర్ణయించుకుని గుంటూరు నుంచి మల్యాలకు చేరుకున్నారు. ప్రేమ వివాహం చేసుకున్న అబ్బాయి కుటుంబంపై అమ్మాయి బంధువుల దాడి చేశారు.
వీరి ప్రేమ పెళ్లిని అమ్మాయి కుటుంబం అంగీకరించకపోవడంతో ఇరు కుటుంబాల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. ఇరువర్గాలకు ఎస్ఐ సమక్షంలో పోలీసుల కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా కూడా బెదిరింపులు కొనసాగాయి. కార్లలో వచ్చిన దుండగులు పెద్ద కట్టెలతో మహిళలు, అబ్బాయి, అబ్బాయి తండ్రిపై దాడి చేసి 'చంపేస్తాం' అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. మాధవిని బలవంతంగా కారులో ఎక్కించి తీసుకెళ్లడం సినీ ఫక్కీలో జరిగింది.
యువతి బంధువుల దాడిలో గాయపడిన బాధితులను పోలీసులు జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో వారు చికిత్స పొందుతున్నారు. అయితే యువతిని ఎలా ఎత్తుకెళ్లారనేది సీసీ కెమెరాలో రికార్డయ్యింది. సీసీ ఫుటేజ్ బయటకు వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వెంటనే అమ్మాయిని రక్షించి దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భర్త నల్ల ముత్తుకుమార్, బాధిత కుటుంబసభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook