Angry King Cobra Latest Video Watch: యూట్యూబ్‌లో అక్బర్ అజీజ్ స్నేక్ క్యాచర్ ఛానల్‌కి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. నిత్యం సోషల్ మీడియాలో తను పట్టుకుంటున్న పాములకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఇతను పోస్ట్ చేసే షార్ట్ వీడియోలకి మంచి గుర్తింపు ఉంటుంది. ఎప్పుడు ఈ వీడియోను వైరల్ అవుతూ వస్తూనే ఉంటాయి. తాజాగా అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రాను పొలం దగ్గర ఎంతో సాహసం చేసి పట్టుకున్న దృశ్యాలు ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసేలా చేస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఇప్పుడు ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
వీడియో వివరాల్లోకి వెళ్తే.. ప్రారంభంలోనే ఒక స్నేక్ క్యాచర్ ఎంతో సాహసం చేస్తున్నట్లు గుర్తించవచ్చు. ముందుగా వీడియోలో ఓ పొలం గట్టు దగ్గర చిన్న రంధ్రంలో ఏదో కదలడం కనిపిస్తుంది. అంతేకాకుండా అందులో నుంచి బయటికి ఓ అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రా తొంగి చూడడం కూడా గమనించవచ్చు. అయితే, అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ ఆ పామును ఎలాగైనా బయటికి తీసి రెస్క్యూ చేసేందుకు రెడీ అయ్యాడు. నెమ్మదిగా బయటికి తొంగి చూస్తున్న పామును తన దగ్గర ఉన్న స్నేక్ స్టిక్‌తో ఒక్కసారిగా కదిలిస్తాడు.
ఆ యువ స్నేక్ క్యాచర్ ఒక్కసారిగా కదిలించడంతో ఆగ్రహానికి గురైన ఆ పాము బయటికి వచ్చేందుకు ప్రయత్నిస్తుంది. పొలం గట్టు రంధ్రంలో ఉన్న ఆ పాము నెమ్మదిగా బయటికి వస్తుంది. బయటికి వచ్చిన ఆ నాగుపాము వెంటనే తన ముందే ఉన్న స్నేక్ క్యాచర్‌పై దాడి చేసే ప్రయత్నం చేస్తుంది. అయితే, స్నేక్ క్యాచర్ దీనిని ముందుగానే గమనించి.. వెంటనే తన దగ్గర ఉన్న స్నేక్ స్టిక్‌తో ఆ పాముని దూరంగా విసిరేసాడు. అయినప్పటికీ పాము ఎంతో ఆగ్రహంగా ఉండడంతో అతని దగ్గరికి కాటేసేందుకు వస్తుంది.
Read More: Orgninal Snake Dimond Video: నాగుపాము తలకు అరుదైన నాగరత్నం.. వీడియో చూసి ఆశ్చర్యపోతున్న జనాలు..
దీంతో ఆ యువకుడు ఎంతో చాకచక్యంగా ఆ పాము తోకను పట్టుకొని.. బంధించే ప్రయత్నం చేస్తాడు. అయితే, ఇదే సమయంలో ఆ పాము అతనిని కాటేస్తే ఎందుకు ప్రయత్నిస్తుంది. ఇలా ప్రయత్నించగానే ఆ పాము అతనిపై మరోసారి కాటేందుకు ప్రయత్నించింది. దీనిని గమనించి ఎంతో జాగ్రత్తగా ఆ పామును పట్టేసుకున్నాడు. ఇప్పుడు ఈ వీడియోని సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తుంది. ముఖ్యంగా ఈ వీడియోలో ఆ పాము స్నేక్ క్యాచర్ పైకి రావడం చూసి సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యానికి గురయ్యారు.
Read More: Orgninal Snake Dimond Video: నాగుపాము తలకు అరుదైన నాగరత్నం.. వీడియో చూసి ఆశ్చర్యపోతున్న జనాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









