Another Meerut Shocker: మీరట్ లో మరో దారుణం.. ప్రియుడి మోజులో పడి భర్తపై కట్టుకున్న భార్య స్నేక్ అస్త్రం..!

Wife Extra marital Affair: మీరట్ లో ఇటీవల ఒక వ్యక్తి మరణించాడు. అతని బెడ్ కింద పెద్ద పాము ఉంది. అది పలుమార్లు అతడ్ని కాటు వేసింది. అయితే..ఈ ఘటనలో పోలీసులు అతని మెడపై చేతి వేళ్లను గమనించారు . పోస్ట్ మార్టం నిర్వహించగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.  

Written by - Inamdar Paresh | Last Updated : Apr 17, 2025, 03:51 PM IST
  • భర్తను చంపిన మరో భార్య..
  • పాముతో కాటు వేయించి మరీ..
Another Meerut Shocker: మీరట్ లో మరో దారుణం.. ప్రియుడి మోజులో పడి భర్తపై కట్టుకున్న భార్య స్నేక్ అస్త్రం..!

woman killed husband with lover in meerut: ఇటీవల కాలంలో వివాహేతర సంబంధానికి చెందని వార్తలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి . ఒకప్పుడు భర్తలు తమ భార్యల్ని వేధించేవారు. ఈ క్రమంలో ప్రస్తుతం అన్నిరంగాల్లో రాణిస్తున్నామ్.. ఇందులో కూడా ఎందుకు తగ్గాలని కొంతమంది మహిళలు అనుకున్నారో ఏంటో కానీ.. మగాళ్లను రాచి రంపాన పెడుతున్నారు. కట్టుకున్న భర్తల్ని  వేధిస్తున్నారు. కొన్ని చోట్ల భర్తలు .. తమ భార్యల టార్చర్ భరించలేక సెల్ఫీ వీడియోలు తీసుకుని మరీ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

Add Zee News as a Preferred Source

ఇటీవల మీరట్ లో ఒక వివాహిత కట్టుకున్న భర్తను.. ప్రియుడి సాయంలో చంపి.. డ్రమ్ లో పెట్టిన సంగతి  తెలిసిందే. ఈ ఘటన దేశంలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన మరువక ముందే అదే మీరట్ లో మరో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ కూడా వివాహేతర సంబంధమే దారుణానికి కారణం. 

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం మీరట్ జిల్లాలోని బెహసుమ ప్రాంతం ఉంది.  అక్బర్ పూర్ గ్రామంలో అమిత్-రవిత అనే దంపతులు నివసిస్తున్నారు. అయితే.. అమిత్ ఇంటికి తరచుగా అతని స్నేహితుడు అమర్ దీప్ వస్తుండేవాడు. ఈ క్రమంలో రవితకు, అమర్ దీప్ తో ఎఫైర్ ఏర్పడింది. ఇద్దరు తరచుగా మాట్లాడుకునేవారు. ఈ విషయం తెలియడంతో భర్త తన స్నేహితుడ్ని, భార్యను మందలించాడు. ఈ క్రమంలో పలుమార్లుభార్యతో గొడవ పెట్టుకున్నాడు. 

ఇక భర్తను ఎలాగైన అడ్డుతొలగించుకొవాలని ప్రియుడితో కలిసి అమిత్ భార్య రవిత స్కేచ్ వేసింది. ఒక పాముల వాడి నుంచి వెయ్యి రూపాయలకు పామును కొన్నారు. అప్పటికే భర్తకు నిద్రమాత్రలు కల్పిన అన్నం పెట్టింది. అది తినిపోయిన నిద్రలో జారుకున్నాక.. భార్య, ప్రియుడు కలసి భర్త.. గొంతు పిసికి హత్య చేశారు.

ఆ తర్వాత.. అతని బెడ్ కింద పాము పెట్టింది. పాము ఆ వ్యక్తిని పలుమార్లు కాటు వేసింది.ఉదయం వరకు ఆ పాము అక్కడే ఉంది. నిద్రలో తన భర్తను పాము కాటేసిందని మహిళ ప్రచారం చేసుకుంది. ఈ క్రమంలో పోలీసులకు ఆమె తీరు అనుమానం రావడంతో.. వెంటనే అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. 

Read more: Viral Video: అబ్బా.. పిండేసిందీ భయ్యా..!.. మెట్రోలో టీనేజ్ అమ్మాయి చేసిన పనికి నెటిజన్లు ఫిదా.. వీడియో వైరల్..

శవ పరీక్ష నివేదికలో గొంతు నులిమి చంపేశారని తేలడంతో పాటు.. మృతదేహంపై పది పాముకాట్లు ఉన్నాయని వైద్యులు వెల్లడించారు. దీంతొ సదరు మహిళ, ఆమె ప్రియుడు బండారం బైటపడింది. ఈ క్రమంలో పోలీసులు ఇద్దర్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News