)
Antarctica Job With High Salary: ఇదొక ప్రపంచంలోనే వింతైన వార్త! ఓ వ్యక్తికి 29 ఏళ్ల పర్యావరణ పరిశోధకుడికి భారీ జీతంతో ఉద్యోగం వచ్చింది. దాదాపు 1,45,000 అమెరికన్ డాలర్లు (అంటే భారత కరెన్సీలో సుమారు రూ. 1.31 కోట్లు) జీతంతో పాటు వసతి, ఫుడ్, ట్రావెలింగ్ వంటి ఖర్చులు కంపెనీయే భరిస్తుంది. అయితే, అన్ని ఆఫర్స్ ఉన్నా.. ఆ జాబ్‌లో చేరేందుకు ఓ వ్యక్తి ఆందోళనకు గురవుతున్నాడు. ఆ ఉద్యోగంపై ఆసక్తి లేకపోవడానికి ఆ వ్యక్తి ఓ విచిత్రమైన కారణం చెబుతున్నాడు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రెడ్డిట్ బ్లాగర్లో ఓ వ్యక్తి తన జీవితంలో ఎదురైన సందిగ్ధతను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అయితే ఆ వ్యక్తికి వచ్చిన ఉద్యోగం హైదరాబాద్, బెంగుళూరు, చెన్నైలో కాదు.. మంచుతో నిండిన, అత్యంత చల్లగా ఉండే అంటార్కిటికా ఖండంలోని మెక్ముర్డో స్టేషన్లో ఆరు నెలల పరిశోధన అసైన్మెంట్ కోసం అక్కడికి వెళ్లాల్సి వచ్చింది.
ఇంటర్నేషనల్ జాబ్.. అత్యంత అరుదైన ఈ అవకాశం, అతనికి భారీ జీతం వచ్చినప్పటికీ.. ఒకే ఒక్క కారణంగా చేత అతడు గందరగోళానికి గురవుతున్నాడు. గత మూడేళ్లుగా అతను తన స్నేహితురాలితో రిలేషన్షిప్లో ఉన్నాడు. దీంతో రాబోయే ఆరు నెలలు ఆమెకు దూరంగా, ఒంటరిగా ఉండాల్సి రావడం, అలాగే తీవ్రమైన చలి వాతావరణంలో జీవించడం తన వ్యక్తిగత జీవితాన్ని ప్రభావితం చేస్తుందని అతను భయపడుతున్నాడు.
ఆరు నెలల్లో జీవితాన్ని మార్చే భారీ మొత్తంలో డబ్బు ఒకవైపు ఊరిస్తుండగా.. మరోవైపు తన ప్రేయసిని వదిలి పూర్తిగా కొత్త వాతావరణంలో ఒంటరిగా జీవించే కష్టం... ఈ రెండింటి మధ్య అతను నలిగిపోతున్నాడు. ఇదే విషయమై అతను కొందర్ని సలహాలు అడిగాడు. ఈ యువకుడి సందిగ్ధతపై రెడ్డిట్ యూజర్లు కొన్ని భిన్నమైన సలహాలు ఇస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
మంచి భవిష్యత్తు కోసం..
కొంతమంది నెటిజన్లు.. "ఆరు నెలల్లో మీ ఆస్తులను రెట్టింపు చేసే అవకాశం వస్తే దాన్ని వదులుకోకూడదు. మీ ఇద్దరి భవిష్యత్తు కోసమే ఈ త్యాగం చేస్తున్నట్లు భావించు" అని ప్రోత్సహించారు. "ఇది జీవితంలో లక్షకు ఒకసారి వచ్చే అవకాశం. మీ ప్రేయసి మీకు సపోర్ట్ చేస్తే.. ఆమె ఖచ్చితంగా మిమ్మల్ని అర్థం చేసుకుంటుంది. ఆరు నెలలు పెద్ద కాలం కాదు" అని మరొకరు సలహా ఇచ్చారు.
బంధమే ముఖ్యం..
మరికొందరు ఈ ఉద్యోగం తీసుకోవద్దని సూచించారు. "దూరంగా ఉండటం గురించి కేవలం ఆలోచించడం వేరు, దాన్ని జీవించడం వేరు. ఇంత కాలం దూరంగా ఉండటం ప్రేమ సంబంధానికి మంచిది కాదు" అని అభిప్రాయపడ్డారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook