)
Asi birthday party goes controversy in datia video: సమాజంలో ఎవరికి అన్యాయం జరిగిన పోలీసుల దగ్గరకు వెళ్తారు. పోలీసులను చాలా మంది ఎంతో గౌరవంతో చూస్తారు. కానీ కొంత మంది తీరు మాత్రం పోలీసు శాఖకే మచ్చ తీసుకుని వచ్చేదిగా ఉంటుంది. అంతే కాకుండా.. స్టేషన్ కు ఫిర్యాదులు ఇద్దామని వచ్చిన వారిపై వేధింపులకు పాల్పడటం వంటివి చేస్తున్నారు. బాధితులపై అక్రమ కేసులు పెడుతామని చెప్పిలొంగ దీసుకుంటున్నారు.
కానిస్టేబుల్ పుట్టినరోజు వేడుకల్లో బార్ డ్యాన్సర్లతో డ్యాన్స్ వేసిన ASI, కానిస్టేబుల్
మధ్యప్రదేశ్‌లోని దతియా పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీసులుగా గుర్తింపు
వీడియో వైరల్ కావడంతో వారిని సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు pic.twitter.com/6KkAZSD4xV
— greatandhra (@greatandhranews) September 9, 2025
ఇలాంటి ఘటనలు ఇటీవల ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. కొంత మంది ఇలాంటి పనులు చేసినకూడా మొత్తంగా డిపార్ట్ మెంట్ మీదనే చెడ్డపేరు వస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఒక పోలీసు అధికారి, కానిస్టేబుల్ చేసిన ఛెండాలం వైరల్‌గా మారింది.
మధ్యప్రదేశ్‌లోని దాటియాలో ఒక అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ (ASI), ఒక కానిస్టేబుల్ పుట్టినరోజు వేడుకలో పాల్గొన్నాడు.ఈ బర్త్ డే పార్టీని ఒక హోటల్ లో నిర్వహించారు. అక్కడ కొంత మంది పోలీసులు ఫుల్ గా మద్యం తాగారు. అంతే కాకుండా.. ఇద్దరు మహిళలతో రెచ్చగొట్టే విధంగా అశ్లీల డ్యాన్స్ చేశారు.
మహిళల్ని ఇష్టం ఉన్నట్లు పట్టుకుని నీచంగా స్టెప్పులు వేశారు. డబ్బులు వేదజల్లారు. ఈ వీడియో వైరల్ కావడంతో దీనిపై పోలీసులు సీరియస్ అయ్యారు. ఇద్దరు పోలీసుల్ని సస్పెండ్ చేస్తు అధికారులు చర్యలు తీసుకున్నారు. దీనిపై విచారణకు అధికారులు ఆదేశించారు.
దతియా జిల్లా ప్రధాన కార్యాలయంలోని సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్లో ASIగా విధులు నిర్వహిస్తున్న సంజీవ్ గౌడ్, సెప్టెంబర్ 2న నగరంలోని ఒక హోటల్లో కానిస్టేబుల్ రాహుల్ బౌధ్ పుట్టినరోజు సందర్భంగా జరిగిన పార్టీలో బార్ డ్యాన్సర్లతో కలిసి బాలీవుడ్ పాటలకు డ్యాన్స్ చేసిన ఘటన పెద్ద దుమారంగా మారింది. దీనిపై నెటిజన్లు సైతం మండిపడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook