Baby Cobra Viral Video: టాయిలెట్‌లోకి దూరిన నాగుపాము పిల్ల.. ఎలా పట్టుకున్నారో చూడండి.. వీడియో ఇదే..

Baby Cobra Viral Video Watch: సోషల్ మీడియాలో అటవీశాఖ అధికారి పామును పట్టుకుంటున్న వీడియోలో ప్రత్యక్షమైంది. ఈ వీడియోలో పాము చిన్నదే అయినప్పటికీ చాలా చురుకుగా ఉండటం చూడొచ్చు. అయితే ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 26, 2025, 07:53 PM IST
Baby Cobra Viral Video: టాయిలెట్‌లోకి దూరిన నాగుపాము పిల్ల.. ఎలా పట్టుకున్నారో చూడండి.. వీడియో ఇదే..

Baby Cobra Video Watch: పాములను పట్టుకునేందుకు స్నేక్ క్యాచర్స్‌తో పాటు అటవీశాఖ అధికారులు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికి చాలామంది పాములు పట్టే వృత్తిని ఎంచుకుంటున్నారు. వారికి దీనివల్ల పెద్దగా లాభం లేకపోయినప్పటికీ పామును రక్షించేందుకు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. సాధారణంగా ఇప్పుడు టెక్నాలజీ పెరగడంతో చాలామంది పాములు పట్టేవారు వారు వారు పడుతున్న కష్టాలు, పాములు పట్టుకునే క్రమంలో ఎదురయ్యే సమస్యలను వీడియోలుగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలే ఇప్పుడు వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా అటవీశాఖ అధికారి పామును పట్టుకుంటున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది కాస్త ఇప్పుడు వైరల్‌గా మారింది. 

Add Zee News as a Preferred Source

వీడియో వివరాల్లోకి వెళితే.. ఓ దేశానికి సంబంధించిన అటవీశాఖ సిబ్బంది బాత్రూంలో పాము దూరిందని సమాచారం రావడంతో ఓ ఇంటికి వెళ్తాడు. ఆ ఇంట్లో పామును బాత్రూంలో ఉందని పామును గుర్తించి ఆ సిబ్బంది ఒక బాటిల్‌లో దానిని బంధించేందుకు ప్రయత్నిస్తాడు. తల దగ్గర బాటిల్ పెట్టి ఆ పామును నెమ్మదిగా కదలించే ప్రయత్నం చేస్తాడు. అయితే ఆ నాగుపాము చాలా చురుకుగా ఉండడంతో బాటిల్‌లోకి దూర లేకపోతుంది. అతడికి ఉన్న నైపుణ్యంతో పామును అటు ఇటు అంటాడు. అయినప్పటికీ పాము ఏ మాత్రం భయపడకుండా ఆ బాటిల్లోకి అస్సలు దూరదు. 

కొద్దిసేపటి తర్వాత దానికి అదే పాము ఆ బాటిల్‌లోకి దూరుతుంది.. దీంతో ఆ బాటిల్ క్యాప్‌ను అటవీశాఖ సిబ్బంది నెమ్మదిగా మూసేస్తాడు..అంతేకాకుండా పాము ఊపిరి పీల్చుకోవడానికి రెండు రంధ్రాలు చేస్తాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే బాటిల్‌లోకి దూలిన తర్వాత ఆ పాము ఈ జాతికి సంబంధించిందని పరీక్షించి చూస్తారు. దీంతో వారు అది అత్యంత పప్రమాదకరమైన కింగ్ కోబ్రా జాతికి సంబంధించిన పామని తెలుసుకుంటారు. చలికాలంలో పాటు వర్షాకాలం ఇంటి ప్రదేశాల్లో ఓ కన్నేసి ఉంచాలి. లేకపోతే ఇలా పాములు ఇళ్లలో దూరి ఎక్కడ పడితే అక్కడ నక్కి దాడి చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ పాముకు సంబంధించిన సంబంధించిన వీడియోను హబ్లూట్ బగ్గిన్స్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేశారు.

Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News