Cute Baby Crocodile Video Viral Watch Here: మొసల్లు వాటి పిల్లలకు గుడ్ల ద్వారా జన్మనిస్తాయి. నీటి ఒడ్డున లేదా నది సమీపాన గూడు కట్టుకొని అందులో గుడ్లను పెడుతూ ఉంటాయి. కొన్ని మొసళ్ళతే ప్రత్యేకంగా నదిలో పెరిగే ఆకులు వాటి కొమ్మలు మట్టి ఇతర పదార్థాలతో ఒక ప్రత్యేకమైన గూడును నిర్మించి అందులో గుడ్లను పెడుతుంటాయట. ఆడ ముసలి దాదాపు ఒకేసారి 20 నుంచి 80 వరకు గుడ్లను పెడుతుందని సమాచారం. ఈ గుడ్లు అన్నిటికంటే చాలా భిన్నంగా ఉంటాయి అంతేకాకుండా ఒక ప్రత్యేకమైన పొడవైన షేపులో గట్టి షెల్ కలిగి ఉంటాయి. ఆడ మొసలి వాటి పిల్లలకు జన్మనిచ్చేందుకు దాదాపు 55 నుంచి 100 రోజుల వరకు ఒక ప్రత్యేకమైన ఉష్ణోగ్రతో గుడ్లపై పొదుగుతుంది. ఆ తర్వాత అవి నేరుగా గుడ్ల నుంచి పిల్లలకు జన్మనిస్తాయి. అయితే కొన్ని మొసళ్ళు ఈ గుడ్లు ఇతర జంతువులకు ఆహారంగా కాకుండా గుడ్లను గూటిలో పాతిపెట్టే ప్రత్యేకమైన శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటాయి.
పిల్లలకు జన్మనిచ్చిన తల్లి మొసళ్ళు వాటిని రక్షించుకోవడానికి గూడు దగ్గరే ఉంటాయట వీటికి ఆహారాలను మగ మొసల్లు అందిస్తాయని సమాచారం. సాధారణంగా పిల్ల మొసళ్ళు గుడ్ల నుంచి బయటికి వచ్చిన తర్వాత కేవలం 6 నుంచి 9 అంగుళాల పొడవు మాత్రమే ఉంటాయి. వాటి శరీరం ఆకుపచ్చరంగు తోపాటు గోధుమ రంగును కలిగి ఉంటుంది. అలాగే వాటిపై నల్లని చారలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఈ పిల్లలు బయటికి వచ్చిన కొన్ని రోజుల వరకు ఎలాంటి కళ్లను కలిగి ఉండవట.. గుడ్డు నుంచి బయటికి వచ్చిన 15 రోజుల తర్వాత కళ్ళతోపాటు ఇతర అవయవాలను పొందుతాయని సమాచారం. అయితే ఎప్పుడైనా మీరు మొసళ్ళుకు సంబంధించిన గుడ్లను చూశారా? అంతేకాకుండా అందులో పిల్లలు ఎలా బయటికి వస్తాయో మీకు తెలుసా? చూడని వారికోసం ఈ వీడియో..
తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఇద్దరు వ్యక్తులు మొసలి గుడ్లను పగలగొట్టి అందులో నుంచి పిల్లలను బయటకు తీయడం మీరు గమనించవచ్చు. ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి తన చేతిలో ఉన్న కత్తెరతో మొసలి గుడ్డును పగలగొట్టి ఇంకొకరి చేతికి అందించడం మీరు గమనించవచ్చు. అతడు ఆ గుడ్డులో నుంచి పిల్లను బయటికి తీస్తూ కెమెరాకు చూపించడం మీరు చూడవచ్చు. ఎంతో చిన్నగా ఉన్న పిల్ల అరవడం కూడా మీరు గమనించవచ్చు. దీనికి సంబంధించిన వీడియో @FADYfily అనే యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను కొన్ని కోట్ల సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించారు. అంతేకాకుండా కొంతమంది లైక్ కూడా చేశారు.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









