Viral Video: అరె వావ్.. తల్లితో కలిసి గున్న ఏనుగు టబ్ స్నానం.. వైరల్గా మారిన ఫన్నీ వీడియో..

Elephant funny video:  గున్న ఏనుగు తన తల్లితో కలసి టబ్ దగ్గరకు వచ్చింది.  అవి రెండు కలిసి చక్కగా నీళ్లతో చాలా సేపు ఆడుకున్నాయి. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Jun 3, 2025, 01:49 PM IST
  • ఫన్నీగా ప్రవర్తించిన గున్న ఏనుగు..
  • వీడియో వైరల్..
Viral Video: అరె వావ్..  తల్లితో కలిసి గున్న ఏనుగు టబ్ స్నానం.. వైరల్గా మారిన ఫన్నీ వీడియో..

Baby elphant bathing with his mother video: చాలా మంది తమ ఇళ్లలో కుక్కలు, పిల్లుల్ని పెంచుకుంటు ఉంటారు. ఇటీవల కాలంలో అరుదుగా అడవిలోని జంతువుల్ని, పాములు, కొండ చిలువల్ని కూడా కొంత మంది పెంచుకుంటున్నారు. అయితే.. ఇంట్లో జంతువుల్ని పెంచుకునేటప్పుడు అవి ప్రవర్తించే తీరు చాలా ఫన్నీగా ఉంటుంది. అవి చేసే పనుల్ని చూస్తే మనలోని ఒత్తిడి తెలియకుండానే దూరమౌతుంది.

Add Zee News as a Preferred Source

ఈ క్రమంలో ప్రస్తుతం ఒక ఏనుగు తల్లితో కలసి స్నానం చేసిన వీడియో నెట్టింట తెగ వైరల్గా మారింది. దీనిలో గున్న ఏనుగు తల్లితో పాటు నీటి దగ్గరకు వచ్చింది. సాధారణంగా ఏనుగుల శరీరం చాలా వేడిగా ఉంటుందని చెబుతుంటారు. పొరపాటున వాటి రక్తం మన శరీరంపై పడితే.. బొబ్బలు వస్తాయి.

చర్మం అంతా కూడా కాలిపోతుంది. అందుకు ఏనుగులు తమ శరీరంలోకి వేడిని చల్లబర్చుకొనేందుకు తరచుగా నీళ్లలోకి వెళ్లి జలకాలాటలాడుతుంటాయి.  ఈ క్రమంలో ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఒక గున్న ఏనుగు తన తల్లితో కలిసి టబ్ దగ్గరకు వెళ్లింది.

Read more: Cobra Snake Video: వామ్మో.. బట్టలలో దూరిపోయిన భారీ సర్పం.. వీడియో చూస్తే షాక్ అవ్వడం ఖాయం..

అది టబ్ లోకి దిగి.. తన కోసమే.. టబ్ ను పెట్టినట్లు బాత్ చేసింది. ఆ ఏనుగుల్ని పెంచుకుంటున్న దాని యజమాని ఏనుగుల మీద వాటర్ పైప్ తో నీళ్లను పోశాడు. తల్లి ఏనుగు, దాని పిల్ల సైతం.. చక్కగా స్నానం చేస్తు ఎండ వేడి నుంచి, శరీరం హీట్ నుంచి ఉపశమనం పొందాయి. అయితే.. టబ్ లో పడుకుని గున్న ఏనుగు ఫన్నీగనా ప్రవర్తించిన తీరు ప్రస్తుతం వైరల్గా మారింది . గున్న ఏనుగు భలే ముద్దుగా ఉందని నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News