Rare King Cobra Video: బాలుడి డ్రాయర్‌లోకి దూరిన కింగ్ కోబ్రా పిల్ల.. నెట్టింట్లో వీడియో తెగ వైరల్..

Rare King Cobra Video: ఓ చిన్న కింగ్ కోబ్రా బాలుడి డ్రాయర్‌లోకి దూరిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఈ వీడియో చూసిన వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. అయితే వీడియో మీరు కూడా చూస్తారా..?

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 16, 2025, 08:42 AM IST
Rare King Cobra Video: బాలుడి డ్రాయర్‌లోకి దూరిన కింగ్ కోబ్రా పిల్ల.. నెట్టింట్లో వీడియో తెగ వైరల్..

Rare King Cobra Video Watch Here: సాధారణంగా అడవుల్లోని కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా చెట్లు నరకడం వల్ల ఆహార కొరత ఏర్పడి జీవరాసులు జనాభాసాల్లోకి సంచారం చేస్తూ ఉన్నాయి. కొన్నిచోట్ల నీటి సాంద్రత కూడా తగ్గి జంతువులకు అంతరాయం ఏర్పడుతోంది. దీనివల్ల చాలా వరకు కొన్ని ప్రదేశాల్లోని అడవికి దగ్గరగా ఉండే జనావాసాల్లోకి ఎక్కువగా జంతువులు వస్తూ.. ఉన్నాయి. అయితే జంతువులే కాకుండా తరచుగా పాములు కూడా సంచారం చేస్తూ ఉంటాయి. అంతేకాకుండా కొన్ని పాములైతే జనాలపై దాడి చేసి ప్రాణాలు కూడా తీస్తున్నాయి. అయితే కొంతమంది పాములను ముందుగానే గుర్తించి స్నేక్ క్యాచర్స్‌కి ఇన్ఫర్మేషన్ అందిస్తున్నారు. ఏది ఏమైనా అడవి ప్రాంతాల్లో జీవించే వారు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే వాటి కాటు బారిన పడే అవకాశాలు ఉన్నాయి. అయితే కొంతమంది స్నేక్ క్యాచర్ తరచుగా వారు పట్టుకున్న పాములకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉన్నారు. తాజాగా ఓ స్నేక్ క్యాచర్ పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

Add Zee News as a Preferred Source

అడవి ప్రాంతాల్లో జీవించే వ్యక్తులు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది లేకపోతే పాములు ప్రాణాలనే తీయవచ్చు. అప్పుడప్పుడు కొన్ని పాములు చెప్పులు షూలలో కూడా నక్కిన దాఖలాలు ఉన్నాయి. ఇలాంటి సందర్భంలోనే చాలామంది పాముకాటు బారిన కూడా పడుతున్నారు. మనం ఇలాంటి సంఘటనలు సోషల్ మీడియాలో ఎన్నో చూసి ఉన్నాం.. తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఏకంగా ఓ బాలుడి డ్రాయర్‌లోకి పాము దూరేసింది. ఈ ఘటన థాయ్‌లాండ్‌లోని రేయోంగ్‌ అనే ప్రాంతంలో వెలుగు చూసింది. ఎంతో గాఢ నిద్రలో ఉన్న బాలుడి డ్రాయర్ లోకి ఏకంగా చిన్న కింగ్ కోబ్రా పాము దూరేసింది.  డ్రాయర్ లో ఏదో కదులుతుండడంతో బాలుడు నిద్రలేచి ఒక్కసారిగా చూశాడు. దీంతో పాము కనిపించడంతో బిత్తర పోయాడు. భయంతో కేకలు వేసి ఇంట్లో ఉన్న వారిని పిలిచాడు. అయితే ఆ బాలుడు మాత్రం కదలకుండా అలాగే ఉండి వారిని పిలవడంతో పాము కూడా ఏమాత్రం అటు ఇటు కదలకుండా ఉంది. 

 
 
 
 
 

ఇంట్లో వారంతా బాలుడు దగ్గరికి వచ్చారు.. అయితే వారు ఈ ఘటన గురించి వెంటనే స్నేక్ క్యాచర్లకు చెప్పగా.. వారు అక్కడికి చేరుకున్నారు. వారు ఎంతో జాగ్రత్తగా డ్రాయర్ లో ఉన్న పామును నెమ్మది నెమ్మదిగా బయటికి తీసేందుకు ప్రయత్నించారు. ఇలా కొద్దిసేపు నెమ్మదిగా ప్రయత్నించి బయటికి తీశారు దీంతో ఆ బాలుడి కుటుంబ సభ్యులంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే డ్రాయర్‌లో నుంచి పాములు తీస్తున్న సమయంలో అది కాస్త బుసలు కొట్టినప్పటికీ ఏమాత్రం దాడి చేయలేదు.. దీనికి సంబంధించిన వీడియోను అక్కడే ఉన్న స్థానికులు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇప్పటివరకు ఈ వీడియోను 80,000 మందికి పైగా లైక్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కొంతమంది ఫన్నీ కామెంట్స్ కూడా చేశారు.

Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

 

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News