)
King Cobra Babies Video Watch Here: కింగ్ కోబ్రా పాములంటేనే ఎంతో భయపడుతూ ఉంటారు. ఇవి చాలా ప్రమాదకరమైన పాములుగా చెప్పుకుంటారు. వీటి పిల్లలకు కూడా అత్యంత ప్రమాదకరమైన విషం ఉంటుంది. కానీ పెద్ద పాముల కంటే కింగ్ కోబ్రా పిల్లలు చూడడానికి ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటాయి. వీటి పడగ ఎంతో ఆకర్షనీయంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే వీటి కోరలు చూసిన ఏమాత్రం భయం పట్టదు. సాధారణంగా మనం చూసే భారీ సర్పాల కంటే.. ఈ కింగ్ కోబ్రా పిల్లలే చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి. తాజా సోషల్ మీడియాలో కింగ్ కోబ్రా పిల్లలకు సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోను అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రా పిల్లలను ఒక యువకుడు పట్టుకొని ఉండడం మీరు చూడొచ్చు. ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
కింగ్ కోబ్రా పిల్లలు పుట్టిన కొన్ని రోజులకు చాలా చురుకుగా ఉంటాయి. ఇది చూడడానికి చాలా సన్నగా అందమైన పడగను కలిగి ఉంటాయి. అలాగే అవి చిన్నగా ఉన్నప్పుడు మాత్రమే.. వాటి కింది భాగం తెలుపు రంగులో కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా చాలా హుషారుగా దూకుడు స్వభావాన్ని కలిగి ఉంటాయి. అయితే ఇలాంటి పిల్లలనే ఒక యువకుడు తన రెండు చేతిలో పట్టుకొని ఉన్నాడు. మామూలుగా వీడియోలో ఒక పాము పిల్ల సాధారణంగా ఉన్నప్పటికీ.. తన ఎడమ చేతిలో ఉన్న పాము పిల్ల మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంది. అది దాని నోరు తెరిచి.. అటు ఇటు చూడడం మీరు గమనించవచ్చు..
ఈ వీడియో చూసిన చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు పాము పిల్లలు ఎంత అందంగా ఉన్నాయో అని ఆసక్తిగా చూస్తున్నారు. మరి కొంతమంది అయితే పాము పిల్లలుగా ఉన్నప్పటికీ చాలా ప్రమాదకరమని చెబుతున్నారు. పిల్లల సమయంలో కూడా నాగుపాములు విష కోరలను కలిగి ఉంటాయని వారంటున్నారు. ఇక మరి కొంతమంది ఆ యువకుడు ఎడమ చేతిలో ఉన్న పాము నోరు తెరుస్తోందని.. దానిని గమనించి అప్రమత్తంగా ఉండాలని వీడియోలో ఉన్న వ్యక్తి చెబుతున్నారు.
ఏది ఏమైనా ఇలాంటి పాములకు సంబంధించిన వీడియోలు తరచుగా వైరల్ అవుతూ ఉంటాయి. చూసిన చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు లైక్ చేసి కామెంట్లు కూడా చేస్తారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోను @Gog.official334 అనే యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను కొన్ని వందల మందికి పైగా సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా 11మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియో పోస్ట్ చేసి కొన్ని రోజులైనప్పటికీ చాలామంది చూసేందుకు ఆసక్తి చూపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook