
Baby Monkey Video Watch Here: కోతులు చిలిపి పనులు చేయడంలో ముందు ఉంటాయని అందరికీ తెలిసిందే. కోతులు చేసే ఫన్నీ పనులు అందరిని నవ్వుకునేలా చేస్తాయి. అంతేకాకుండా వాటికి తెలిసి తెలియక చేసిన పనులు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. సోషల్ మీడియాలో కోతి ఫన్నీ సన్నివేశాలకు సంబంధించిన అనేక వీడియోలు నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు ఇలాంటి వీడియోలు చూసేందుకే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. కోతులు ప్రజల చేతుల్లో నుంచి మొబైల్ ఫోన్స్, ఆహార పదార్థాలు లాక్కోవడం, వాటిని పట్టుకొని చెట్ల కొమ్మలకు పైకి వెళ్లడం మనం ఇటీవల ఎన్నో వీడియోలో చూసి ఉన్నాం.. తాజాగా ఓ కోతి పిల్లలకు సంబంధించిన వీడియో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన దీనిని చూసిన నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు.
సాధారణంగా కోతులకు మనుషులు కనిపిస్తే అవి వింతగా ప్రవర్తిస్తూ ఉంటాయి.. కొన్ని సందర్భాల్లో మనుషులపై దాడి చేస్తే.. మరికొన్ని సందర్భాల్లో మాత్రం మనుషులతో ప్రేమగా ఉంటాయి. కొన్ని కోతులు అయితే ఆకలి వేసినప్పుడు మనుషుల దగ్గరికి వచ్చి వారి చేతిలో ఏది ఉంటే అది లాక్కొని తింటూ ఉంటాయి. కానీ తాజాగా ఓ కోతి పిల్ల వీటన్నిటికీ భిన్నంగా చేసింది. ఈ వీడియో చూస్తే మీరు పగలబడి నవ్వుకుంటారు.. ఓ కోతి పిల్ల యువతి లంగలోకి దూరింది. వెంటనే తల్లి కోతి వచ్చి ఆ పిల్లను బయటకు లాగింది.. ఈ సన్నివేశాలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. పిల్ల కోతి చేసిన వింత చేష్టలకి.. సోషల్ మీడియా వినియోగదారులు పగలబడి నవ్వుకుంటున్నారు.
ఈ వీడియోను youghui086 అనే ఇంస్టాగ్రామ్ ఖాతా నుంచి షేర్ చేశారు. అయితే ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. సాధారణంగా యువతి కోతులు ఉండే ప్రదేశం దగ్గర ఒంటరిగా నిలబడుతుంది. అయితే ఇంతలోనే ఓ చిన్న కోతి పిల్ల వచ్చి తన కాళ్ళను పట్టుకొని లంగా లోకి ప్రవేశించింది. ఆ తర్వాత మరో కోతి వచ్చి అలాగే చేసింది. దీనిని గమనించిన తల్లి కోతి ఆ పిల్ల పిల్ల కోతిని లంగాలో నుంచి బయటికి లాక్కొని తీసుకువచ్చింది. దీన్ని చూసి ఇతర కోతులు కూడా ఆమెకు దూరంగా వెళ్లిపోయాయి. తాజాగా ఈ వీడియో నెట్టింట్లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
ఇప్పటికీ ఈ వైరల్ అవుతున్న వీడియోను దాదాపు 11వేల మందికిపైగా వీక్షించినట్లు తెలుస్తోంది. కొంతమంది అయితే ఈ వీడియోను చూసి కామెంట్లు కూడా చేస్తున్నారు. కతల్లి కోతి ఎంతో చక్కగా పిల్లను గైడ్ చేసిన దృశ్యాలు" ఎంతో బాగున్నాయని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. అలాగే "ఒక తల్లి కోతి ఆ యువతి గౌరవాన్ని కాపాడిందని" మరి కొంతమంది కామెంట్లలో అంటున్నారు. మరి కొంతమంది అయితే ఈ వీడియో చూసిన తర్వాత కోతుల దగ్గరికి వెళ్లాలనిపించట్లేదని కామెంట్లు రాసుకుంటూ వస్తున్నారు. ఇక మరి కొంతమంది "ఆ కోతి పిల్ల యువతి లోదిస్తులలోకి వెళ్లినప్పటికీ ఆమె ఎలాంటి స్పందన లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోందని" కామెంట్లు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook