)
Baby Ship Snake Video Watch Here: ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ షార్ట్ వీడియో మానవత్వానికి జంతువుల పట్ల చూపించే దయకూ అద్దం పడుతోంది. ఈ వీడియోలో ఒక వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్న గొర్రె పిల్లను పాము నుంచి రక్షించిన తీరు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసేలా చేస్తుంది. అతడి ధైర్య సాహసాలకు, తెలివితేటలకు సోషల్ మీడియా వినియోగదారులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నిత్యం మనం ఎన్నో రకాల వీడియోలు చూస్తూ ఉంటాం. కానీ వాటన్నిటికంటే ఈ వీడియో చాలా భిన్నమైంది గా భావించవచ్చు. ఈ వీడియోలో ఓ వ్యక్తి జంతువుల పట్ల ఉన్న స్వచ్ఛమైన ప్రేమను చూడొచ్చు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..ఓ వ్యక్తి గ్రామంలోని మేకల మందలు ఒక గొర్రె పిల్ల ప్రాణాపాయ భయంతో అల్లాడిపోతూ ఉంటుంది. దాని వెనక భాగం ఓ ప్రమాదకరమైన నాగుపాము చుట్టుకొని ఉండడం స్పష్టంగా చూడొచ్చు. గొర్రె పిల్ల ఎంత ప్రయత్నించినా ఆ పాము దానిని వదిలిపెట్టలేక పోతోంది. ఆ పాము కు భయపడి గొర్రెపిల్ల అరవడం కూడా చూడొచ్చు. చివరికి ఈ గొర్రె పిల్లను రక్షించేందుకు ఓ వ్యక్తి ముందుకు రావడం వీడియోలు గమనించవచ్చు.
సాధారణంగా ప్రమాదకరమైన పరిస్థితుల్లో చాలామంది పాములను భయపడి దూరంగా వెళ్లిపోతూ ఉంటారు.. కానీ ఆ వ్యక్తి మాత్రం ఎంతో ధైర్యంగా తెలివితేటలు ఉపయోగించి తెలుగులో పైపు సహాయంతో గొర్రె పిల్ల శరీరాన్ని చుట్టుకొని ఉన్న అత్యంత ప్రమాదకరమైన నాగుపామును ఎంతో చాకచక్యంగా పట్టేసుకున్నాడు. ఆ వ్యక్తి ఎంతో దూరంగా ఉండి పామును మెల్లిగా పైపులోకి జారుకునేటట్లు చేశాడు. దీంతో ఆ పాము గొర్రె పిల్ల శరీరాన్ని వదిలిపెట్టి నెమ్మదిగా పైపులోకి జారుకోవడం ప్రారంభించింది. అంతే గొర్రె పిల్లకు పాము నుంచి ప్రాణాపాయం తొలగిపోయింది.
ఈ వీడియో చూసిన చాలామంది కామెంట్లు చేస్తున్నారు. జంతువు ప్రాణాపాయ స్థితిలో ఉందని తెలుసుకొని ఆ వ్యక్తి తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నాగుపాము నుంచి రక్షించడం చూసి అందరూ అతన్ని ప్రశంసిస్తున్నారు. అంతేకాకుండా కొంతమంది ఆ వ్యక్తిని దేవుడిగా అభివర్ణిస్తున్నారు. ఆ వ్యక్తి రెండు నిమిషాలు లేటుగా వచ్చిన ఆ ప్రమాదకరమైన నాగుపాము తప్పకుండా గొర్రె పిల్లపై దాడి చేసి ఉండేది. ఈ దాహడిలో భాగంగా మరణించేది.. ప్రస్తుతం ఈ దృశ్యాలను చాలామంది ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి