Snakes found in vizag video viral: సాధారణంగా పాములు ఎక్కడైతే చల్లగా ఉంటుందో అక్కడ ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా.. వెలుతురు ఉండని ప్రదేశాల్లో కూడా స్నేక్ లు దాక్కుని ఉంటాయి. మనం తరచుగా పాములు బట్టలలో, బైక్ లలో, స్కూటీల్లో, సజ్జల మీద దూరి ఉండటం వంటి ఘటనలు చూశాం. ఈ క్రమంలో పాములు ఇంట్లో కన్పించగానే చాలా మంది స్నేక్ టీమ్ లకు సమాచారం ఇస్తారు.
పాములతో చాలా జాగ్రత్తగా ఉంటారు. పాములకు హనీ తలపెట్టొద్దని భావిస్తారు. అయితే.. పాములు కొన్నిసార్లు ఇంట్లో ప్రవేశించి హల్ చల్ చేస్తుంటాయి. మనం చాలా రోజుల నుంచి ఉపయోగించని ఏవైన వస్తువులు లేదా సంచులు అలానే ఉంచేస్తే.. వాటిలో పాములు దూరిపోయి ఉంటాయి. ఈ క్రమంలో పాముల వీడియోలు తరచుగా నెట్టింట్లో హల్ చల్ చేస్తుంటాయి. ఏపీలోని విశాఖలో ఒక ఇంట్లో పాములు కుప్పలు బైటపడ్డాయి.ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
చాలా రోజుల తర్వాత ఏసీ వేస్తున్నారా.. అయితే మీ ఏసీలో కూడా ఇలానే పాములు ఉండొచ్చు
విశాఖ జిల్లా పెందుర్తిలో సత్యనారాయణ అనే వ్యక్తి ఇంట్లోని ఏసీలో పిల్లలు పెట్టిన పాము
సమాచారం అందుకొని ఏసీలో ఉన్న పాము, పిల్లలను బయటికి తీసిన స్నేక్ క్యాచర్
దీంతో అన్ని పాము పిల్లలను చూసి భయందోళనకు… pic.twitter.com/8fa7V9DKvC
— Telugu Scribe (@TeluguScribe) March 12, 2025
విశాఖ పెందుర్తి పొలగానిపాలెం నేతాజీ నగర్‌లో సత్యనారాయణ అనే వ్యక్తి ఉంటున్న ఇంట్లో పాములు బైటపడ్డాయి. అతగాడు..తన ఇంట్లో ఏసీని ఆన్ చేసేందుకు ప్రయత్నించాడు. అది చాలా కాలంగా ఉపయోగంలో లేదు.ఈ క్రమంలో దాని నుంచి ఏదో బుసలు కొడుతున్న శబ్దాలు వచ్చాయి. దీంతో అతను మెల్లగా స్టుల్ వేసుకుని చూశాడు. వెంటనే పాముల తోకలు కన్పించాయి.
అతగాడు.. భయపడిపోయి పాములను పట్టేవాళ్లకు సమాచారం ఇచ్చాడు. అక్కడ ఒకటి కాదు రెండు కాదు.. పదుల సంఖ్యలో పాముల పిల్లలు ఉన్నాయి. వెంటనే స్నేక్ టీమ్ అక్కడికి చేరుకుని పాములను పట్టుకున్నాడు. తనతో తెచ్చుకున్న ఒక సంచిలో పాములను వేసుకున్నాడు. అయితే.. ఆ పాములు విషపూరితం కాదని స్నేక్ టీమ్ వాళ్లు వెల్లడించారు. ఆ పాములు చిన్నగా ఉన్న బుస్ బుస్ అంటూ.. తమ ప్రవర్తన మాత్రం చూపిస్తున్నాయి.
మొత్తంగా పాములను అక్కడికి నుంచి తీసుకెళ్లడంతో ఆ కుటుంబం హమ్మయ్య అంటూ రిలాక్స్ అయ్యారు. ఈ క్రమంలో ఈ వీడియో వైరల్ అయ్యింది. పాము.. బెడ్ రూమ్ లోకి, అక్కడి నుంచి ఏసీ ఛాంబర్ లోకి ప్రవేశించి.. అక్కడ గుడ్లుపెట్టిన ఆ ఏరియా అంతా పాకిపోయింది. ఈ ఘటన చూసిన చుట్టపక్కల వాళ్లు మాత్రం భయంతో వణికిపోతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









