Bear Viral Video Watch Here: ప్రస్తుతం జంతువులకు సంబంధించిన వీడియోలు ఎప్పుడూ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంటాయి. ఇటీవలే ఒక కుక్క పిల్ల సైకిల్ తొక్కుతున్న AI వీడియో బాగా వైరల్ అయింది. చాలా మంది నెటిజన్స్ ఈ వీడియోను చూసి ఆశ్చర్యపోయిన సంగతి తెలిసిందే.. అలాగే ఈ వీడియోల్లో ఉండే కొన్ని ఫన్నీ సీన్స్ చూసి ఆనందించారు కూడా.. అంతేకాకుండా ఒక పిల్లి తన యజమానితో కలిసి వ్యాయామం చేస్తున్న వీడియో కూడా చాలా మందిని ఆకట్టుకుంది. జంతువుల అమాయకత్వంతో పాటు అవి చేసే వింత పనులు ప్రజలను బాగా ఆకర్షిస్తాయి. ఇదిలా ఉంటే ఇటీవలే ఓ ఎలుగు బంటికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ వీడియో ఇంతలా వైరల్ అవ్వడానికి గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.
ఎంత కృరమైన జంతువులతోనైనా స్నేహం చేయోచ్చు. వీటితో స్నేహం చేసేవారు చాలా మంది ఉన్నారు. చిన్న వయసులోనే భయంకరమైన జంతువులతో ఫ్రెండ్ షిఫ్ చేసి ప్రాణంగా ప్రేమించేవారు ఉన్నారు. అలాగే జంతువులు కూడా మనుషులతో స్నేహం చేస్తాయి. ప్రస్తుతం ఓ ఎలుగు బంటి కూడా ఇదే పని చేస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. వీడియో వివరాల్లోకి వెళితే.. ఓ చిన్న పాప ఎలుగు బంటిపై ఎక్కి సవారీ చేయడం చూడొచ్చు. అంతేకాకుండా ఆ ఎలుగుబంటి కూడా ఏం చక్కగా అటు ఇటూ తిప్పడం మీరు గమనించవచ్చు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ ఎలుగు బంటికి సంబంధించిన వీడియో చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోతారు. మరికొందమందైతే ఇది ఫేక్ వీడియో అని.. ఏఐ సృష్టించిన వీడియో అని అంటున్నారు. దగ్గరగా గమనించి చూస్తే.. ఇది ఒక AI వీడియో అని మీకు కూడా అర్థం అవుతుంది. అయితే ఇప్పుడు యూట్యుబుల్‌లో ఎక్కువగా ఏఐ సృష్టించి కృత్రిమ వీడియోలే ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. ఏం తెలియని సోషల్ మీడియా వినియోగదారులు వీటిని చూసి నిజం అనుకుని ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ ఎలుగు బంటికి సంబంధించిన వీడియో కూడా కృత్రిమ వీడియో అని తెలుసుకుని కొంతమంది నెటిజన్స్ లైట్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియోను @dthejala అనే యూట్యుబ్ ఛానెల్ నుంచి పోస్ట్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









