)
Beer Drinking Nose: సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు వైరల్ అవుతాయి. వాటిలో కొన్ని ప్రజలను ఆశ్చర్యపరుస్తాయి. మరికొన్ని వారిని నవ్విస్తాయి. ఇటీవల అలాంటి ఒక వీడియో ట్రెండింగ్‌లో ఉంది. ఈ వీడియోలో ఒక వ్యక్తి తన ముక్కుతో ఒక గ్లాసు బీరు తాగుతున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.
మనకు తినడానికి, తాగడానికి నోరు.. గాలి పీల్చుకోవడానికి ముక్కు ఉన్నాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇక్కడ ఒక వ్యక్తి ఒకేసారి ముక్కు ద్వారా ఒక గ్లాసు బీరు తాగాడు. అది కూడా కొన్ని సెకన్లలోనే. అవును, ఇది ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ ఇది నిజం.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో, ఒక వ్యక్తి చేతిలో పెద్ద బీరు గ్లాసు పట్టుకుని కనిపిస్తున్నాడు. అతను దానిని కాసేపు ముందుకు వెనుకకు ఊపాడు. తర్వాత కొన్ని క్షణాల్లో, గ్లాసులోని మొత్తం బీరును తన ముక్కుతో తాగేస్తాడు. ఈ వింత సంఘటన చూసి అక్కడున్న వారందరూ షాక్ అయ్యారు.
అక్కడ ఉన్న కొంతమంది ఈ వింత దృశ్యాన్ని చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఇది వైరల్‌గా మారింది. వీడియో చూసిన వారు దీన్ని ఎలా తాగవచ్చో వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తంమీద, ఆ వీడియో వైరల్ అవుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook