)
Man Begging With Snake Video Watch: కొన్నిచోట్ల భిక్షాటన చేసే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతూ వస్తోంది. చాలామంది రోడ్లపై భిక్షాటన చేస్తూ జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. అయితే వీరిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే కొన్ని ప్రభుత్వాలు వారికోసం ప్రత్యేకమైన సహాయక కార్యక్రమాలను చేపట్టాయి. అయినప్పటికీ దేశంలో యాచకుల సంఖ్య తగ్గడం లేదు. చిన్న పెద్ద తేడా లేకుండా రోడ్లపై జనాలు ఇబ్బంది పెడుతూ భిక్షాటన చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా కొంతమంది అయితే దీనిని వ్యాపారంగా కూడా మలుచుకున్నారు. ఈ వ్యాపారంలో భాగంగా రోడ్డుపై ఉండే అనాధలను హక్కున్న చేర్చుకొని.. వారితో రద్దీగా ఉండే ప్రదేశాల్లో భిక్షాటన చేయిస్తున్నారు. ఇలా ఇప్పటికీ ఎన్నో ఘటనలు మనం వార్తల్లో చదివి ఉన్నాం..
బిక్షాటన చేసేవారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు. కొంతమంది వికలాంగులు అయితే కాళ్లు చేతులు లేవని భిక్షాటన చేస్తే మరికొంతమంది చిరిగిన బట్టలు వేసుకొని అడుక్కుంటూ ఉంటారు. ఇలా చేయడం సర్వసాధారణమే అయినప్పటికీ.. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలు ఓ జాతకుడు వింత రీతిలో అడుక్కుంటున్నాడు.. ఇప్పుడు దీనికి సంబంధించిన దృశ్యాలే మామూలుగా వైరల్ అవ్వడం లేదు.. వివిధ సోషల్ మీడియాలో ఎటు చూసినా దీనికి సంబంధించిన వీడియోనే కనిపిస్తూ ఉంది..
వీడియో వివరాల్లోకి వెళ్తే.. ఓ వ్యక్తి రైలులోని కంపార్ట్మెంట్లో చేతులు పాముని పట్టుకొని.. డబ్బులు అడుక్కోవడం మీరు చూడొచ్చు. ఆ వ్యక్తి డబ్బులు ఇవ్వని వారికి ఆ పామును చూపించడం మీరు గమనించవచ్చు ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ముంగావోలి, వీణా జంక్షన్ మధ్య ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ప్రయాణికులను భయపెట్టి మరి డబ్బులు వసూలు చేస్తున్నారని అక్కడున్న చాలామంది అతనిపై కంప్లైంట్ చేశారట.. అయినప్పటికీ అధికారులు అతనిపై చర్యలు తీసుకోలేదని సమాచారం.. ఆ బిక్షాటన చేసే వ్యక్తి తరచుగా అహ్మదాబాద్-సబర్మతి ఎక్స్‌ప్రెస్ జనరల్ కంపార్ట్మెంట్లోకి వచ్చి ఇలానే చేస్తారని కూడా అక్కడి స్థానికులు చెబుతున్నారు. చాలామంది ప్రయాణికులు అతడి పట్టుకున్న పామును చూసి భయపడిపోయి మరి డబ్బులు చెల్లించారని చెబుతున్నారు..
Location: Between Mungaoli to Bina Junction. pic.twitter.com/7vM4UhcCaq
— Deepak रघुवंशी ?? (@draghu888) September 22, 2025
అలాగే ఇప్పటికీ కొంతమంది ప్రయాణికులు అతడు భిక్షాటన చేస్తున్న తీరును చూసి భయపడే పోయిన సందర్భాలు కూడా ఉన్నాయట. ఏది ఏమైనా ఇలా ఎలా పడితే అలా భిక్షాటన చేయడం సరికాదని కొంతమంది ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియోను 'దిర్ఘు8888' అనే X హ్యాండిల్ నుంచి పోస్ట్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను కొన్ని వేలమందికి పైగా సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కామెంట్లలో వారి అభిప్రాయాలను కూడా పంచుకున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి