Bengaluru girl rides without helmet video viral: ఇటీవల కాలంలో బెంగళూరు నగరం ఎక్కువగా వార్తలలో ఉంటుంది. కొంత మంది వాహానాలు నడిపిస్తు కాంట్రవర్సీగా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల ఒక మహిళ కారు నడిపిస్తు.. ల్యాప్ టాప్ ను చూసుకుంటూ ఆఫీస్ వర్క్ ట్రాఫిక్ లోనే చేసుకుంది. అంతేకాకుండా.. ఇటీవల యువత బైక్ మీద రొమాన్స్ చేసుకుంటూ రోడ్డుమీద అడ్డదిడ్డంగా బైక్ ను నడిపి తెగ వైరల్ అయ్యారు.
ఇక ప్రస్తుతం యువతి ఏకంగా హెల్మెట్ లేకుండానే.. తన భుజంపైన మాత్రం రామచిలుకను పెట్టుకుని డ్రైవింగ్ చేసుకుంటూ ట్రాఫిక్ లో రచ్చ చేసింది. యువతి వెనుకాల ఉన్న కొంత మంది వీడియోను రికార్డు చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. దీంతో ఈ ఘటన వైరల్గా మారింది. ట్రాఫిక్ పోలీసులు.. రోడ్డు భద్రత నియమాల్ని పాటించాలని ఎంతగా చెప్తున్న చాలా మంది పూర్తిగా నెగ్లెక్ట్స్ గా ఉంటున్నారు.
Never a dull moment in Bangalore pic.twitter.com/IzUr5nRaP8
— Rahul Jadhav (@iRahulJadhav) February 28, 2025
కారు నడిపేటప్పుడు బెల్ట్ లేకుండా వాహానం నడిపిస్తున్నారు. ఇక టూవీలర్ నడిపేటప్పుడు హెల్మెట్ లేకుండా రెచ్చిపోతున్నారు. చాలా చోట్ల ఇలాంటి ఘటనల్లో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. బెంగళూరులో యువతి హెల్మెట్ పెట్టుకొకుండా.. వాహానంనడిపించడమే కాకుండ.. భుజంపై తన పెంపుడు రామచిలుకను పెట్టుకుని మరీ డ్రైవింగ్ చేస్తుంది.
పొరపాటున ఆమె ఏమైన డైవర్ట్ అయితే.. ఎంత పెద్ద ప్రమాదం జరిగే చాన్స్ ఉంటుందని నెటిజన్లు తలలు పట్టుకుంటున్నారు. మొత్తంగా యువతి రామ చిలుక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి








