Bengaluru Man recording reel drinking tea video: ఇటీవల రీల్స్, సెల్పీల పిచ్చిలో కొంత మంది జనాలు వెర్రీగా ప్రవర్తిస్తున్నారు. అసలు బస్టాండ్ లు, మెట్రోలు, విమానాశ్రయాలు, ఎక్కడకి వెళ్లిన రీల్స్, వీడియోలు, సెల్పీలు దిగుతూ రచ్చ రచ్చచేస్తున్నారు. కొంతమంది డెంజరస్ ప్రదేశాలకు వెళ్లి కూడా తమ ప్రాణాలు సైతం ప్రమాదంలో పడేసి రీల్స్ తీసుకుంటున్నారు.
అంతే కాకుండా.. ఇంకొందరు అడవులలో, ఎత్తైన జలపాతాలు, సముద్రాల దగ్గరకు వెళ్లి రీల్స్ తీసుకుంటున్నారు. ఇలాంటి పనులు చేసేటప్పుడు వారి ప్రాణాలు కూడా పోయిన సంఘటనలు కొకొల్లలు. ఇదిలా ఉండగా.. కొంతరు రీల్స్ చేస్తు వివాదాల్లో కూడా చిక్కుకున్న ఘటనలు అనేకం ఉన్నాయి. కొంత మంది ఫెమస్ కావాలని తమ చుట్టు ఉన్న వాళ్లను ఇబ్బందులకు గురిచేస్తుంటారు.
Taking tea time to the traffic line will brew you a hefty fine, not fame !!! BEWARE BCP is watching you#police #awareness #weserveandprotect #stayvigilant pic.twitter.com/5A8aCJuuNc
— ಬೆಂಗಳೂರು ನಗರ ಪೊಲೀಸ್ BengaluruCityPolice (@BlrCityPolice) April 17, 2025
ప్రస్తుతం బెంగళూరుకు చెందిన వ్యక్తి చేసిన పని ప్రస్తుతం కాంట్రవర్సీగా మారింది. బెంగళూరులో ఉంటున్న ఒక వ్యక్తి ఇటీవల అత్యంత రద్దీగా ఉండే.. మగడి రోడ్డపైన చేరుకున్ని రోడ్డు మధ్యలో ఒక చైర్ వేసుకున్నాడు. అంతేకాకుండా.. కాళ్ల మీద కాలు వేసుకుని.. టీ తాగుకుంటూ రీల్స్ కు ఫోజులు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో చుట్టుపక్కల నుంచి వెళ్తున్న వాహన దారులు ఎంతో ఇబ్బందులు పడ్డారు.
Read more: Tirumala News: గోశాల వివాదం వేళ షాకింగ్ ఘటన.. టీటీడీ బంగ్లాలో భారీ సర్పం.. ఆయనకు కాటు..!
ఈ రీల్స్ కాస్త నెట్టింట వైరల్గా మారింది. దీనిపై బెంగళూరు పోలీసులు రంగంలోకి దిగారు. వెంటనే ఈ రీల్స్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలీలొ ట్రీట్మెంట్ ఇచ్చారు. మొత్తంగా ఫెమస్ అయ్యేందుకు తీసిన రీల్స్ కాస్త అతని కొంప ముంచిందని చెప్పుకొవచ్చు. ఈ వీడియోపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









