)
Bengaluru Woman shouting and vulgar Abuses on Traffic Police video: సోషల్ మీడియాలో తరచుగా అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత ఎక్కడ ఎలాంటి ఘటనలు జరిగిన కూడా వెంటనే తమ ఫోన్ లలో బంధించి వాటిని వైరల్ చేస్తున్నారు. దీంతో ఆ వీడియోలు కాస్త వైరల్ అవుతున్నాయి. రోడ్ల మీద గొడవలకు దిగిన, రొమాన్స్ లు చేసుకున్న, న్యూసెన్స్ లు క్రియేట్ చేసిన లేదా ఏదైన వింత పనులు చేసిన కూడా నెటిజన్లు అస్సలు వెనక్కు తగ్గడంలేదు.
తమదైన శైలీలో ఫోన్ లు తీసుకుని వాటిని రికార్డు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీంతో వీరి యవ్వారం కాస్త అందరికి తెలిసి పోతుంది. కొన్నిసార్లు ఇలాంటి ఘటనల్లో కూడా కొంత మేలు కూడా జరుగుతుందని చెప్పుకొవచ్చు. కొంత మంది అధికారులు ఈ వైరల్ వీడియోలపై ప్రత్యేకంగా నజర్ పేడుతున్నారు. అక్రమాలపై కొరడా ఝుళిపిస్తున్నారు.
ఈ క్రమంలో ప్రస్తుతం బెంగళూరులో జరిగిన ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ట్రాఫిక్ పోలీసులు వాహనదారుల్ని చెక్ చేస్తున్నారు. ఇంతలో ఒక మహిళ తన వాహనాన్ని ఆపడానికి ఎంత ధైర్యం అంటూ పోలీసుల మీదనే బూతులతో రెచ్చిపోయింది. దాడులు చేసేందుకు కూడా రెడీ అయ్యింది.
బెంగళూరులో పబ్లిక్ లో ఒక మహిళ నానా హంగామా చేసింది. ట్రాఫిక్ పోలీసులు వీరి వాహనాన్ని ఆపి వెహికిల్ పత్రాలు చూపించాలని అన్నారు. దీంతో ఆమె ఆగ్రహంతో ఊగిపోయింది. తనను ఎలా ఆపుతారని రివర్స్ లో అటాక్ కు దిగింది. ఆమె ట్రాఫిక్ పోలీసులకు చుక్కలు చూపించింది. భరించలేని బండ బూతుల్ని తిట్టింది. అక్కడకు వచ్చిన మహిళ పోలీసుల్ని సైతం బట్టులు ఊడదీస్తానంటూ నీచంగా మాట్లాడింది.
పురుష ట్రాఫిక్ పోలీసుల్ని బోసిడీకే అంటూ.. చెప్పలేని విధంగా వేళ్లను చూపిస్తు తిట్టింది. వారు వారిస్తున్న కూడా ఆమె వెనక్కు తగ్గలేదు. మొత్తంగా ఆమె చేసిన రచ్చను కొంత మంది వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్గా మారింది. అంతే కాకుండా.. దీనిపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. సదరు మహిళపై కేసును కూడా నమోదు చేశారు.