King Cobra Video: వామ్మో.. జనాల మీద ఎగిరి దాడి చేసిన 16 అడుగుల గిరినాగు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..

Giri naagu Snake in Anakapalle: భారీ గిరినాగు అనకా పల్లిలో పంటపోలాల్లో కన్పించింది. దీంతో రైతులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.  అది అక్కడున్న రైతుల మీదకు కూడా ఎగిరి మరీ దాడికి దిగింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Mar 29, 2025, 10:18 AM IST
  • పొలంలో పాము హల్ చల్..
  • షాక్ అవుతున్న నెటిజన్లు..
King Cobra Video: వామ్మో.. జనాల మీద ఎగిరి దాడి చేసిన 16 అడుగుల గిరినాగు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..

Big King cobra snake giri naagu Found in Anakapalle Video: సాధారణంగా పాముల్ని చూస్తే ప్రాణాల మీద ఆశ ఉన్న ఎవరైన భయంతో వణికిపోతారు. పంట పోలాలు, అడవులు, ఎలుకలు ఉన్న చోట పాములు, కింగ్ కోబ్రాలు నివాసం చేస్తుంటారు. స్నేక్ లు ఎక్కువగా రాత్రి పూట ఎక్కువగా సంచారం చేస్తాయి. అడువులకు దగ్గరగా ఉండే నివాసాల్లో సైతం పాములు కన్పిస్తాయి. చాలా మంది పాములు కన్పిస్తే వెంటనే  తమ స్నేక్ సొసైటీ వాళ్లకు సమాచారం ఇస్తారు. మరికొందరు పాములు ఎక్కవ కాటు వేస్తుందో అని జాగ్రత్తగా ఉంటారు.

Add Zee News as a Preferred Source

ఈ క్రమంలో పాములకు అపకారం తలపెట్టొద్దని కూడా పెద్దలు చెబుతుంటారు. పాములకు ఆపద తలపెడితే కాలసర్పదోషాలు కూడా సంభవిస్తాయి. పాములకు చెందిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు చూస్తే మాత్రం భయంతో వెన్నులో వణుకు పడుతుంది. ప్రస్తుతం ఒక షాకింగ్ పాముల వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది.

 

ఆంధ్ర ప్రదేశ్ లోని  అనాకా పల్లి జిల్లా, దేవరాపల్లిలోనిన పంట పొలాల్లో 16 అడుగుల భారీ గిరినాగు హల్ చల్ చేసింది. పంటపోలాల్లో పాము కన్పించడంతో అక్కడున్న కుక్కలు... గట్టిగా అరుస్తు పాము వెంటపడ్డాయి. ఇంతలో రైతులు, కుక్కలు అంతగా ఎందుకు అరుస్తున్నాయని కూడా అక్కడకు వెళ్లి చూశారు. అప్పువు వారికి 16 అడుగుల బారీ గిరినాగు కన్పించింది. అది కూడా మనుషుల్ని చూడగానే ఒక్కసారిగా వారి మీదకు కోపంతో కాటు వేస్తున్నట్లు ఎగిరి దాడికి ప్రయత్నించింది.

Read more: Gorilla Video: నువ్వు గ్రేట్ భయ్యా.. గొరిల్లాకు చేతులతో నీళ్లను తాగించి.. నెట్టింట ఎమోషన్ తెప్పిస్తున్న వీడియో..

దీంతో రైతులు భయంతో కేకలు వేసి దూరంగా వెళ్లిపోయారు. ఈ క్రమంలో గిరినాగు మరల చెట్ల మధ్యలోకి వెళ్లిపోయింది. రైతులు మాత్రం ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకుని చుట్టుపక్కల పాము మరల వస్తుందేమోనని భయంతో వణికిపోతున్నారు.  అక్కడున్న వారు ఫారెస్ట్ సిబ్బందికి సమాచారం అందించారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్నితు చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.

 

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News