Python climbs on tree smart technique video: సాధారణంగా అడవిలో అనేక క్రూర జంతువులు ఉంటాయి. పులులు, సింహలు, ఏనుగులు, అడవి బర్రెలు, పాములు, ఎలుగు బంట్లు, జింకలు మొదలైన జంతువులు ఉంటాయి. పాములు, కొండ చిలువలు చాలా గుబురుగా ఉండే చెట్లలలో ఎక్కువగా ఉంటాయి. బండరాళ్ల మీద కూడా ఇవి ఎక్కువగా సంచరిస్తుంటాయి. కొండ చిలువ దాని చేసిదంటే.. ఎవరైన సరే.. వారిని చుట్టేసుకుంటుంది.
కొండ చిలువ బలంగా జంతువుల్ని లేదా మనుషుల్ని చుట్టుకుని గాలి ఆడకుండా చేసి, వారి ఎముకలు విరిగిపోయేలా చేస్తుంది. ఈ క్రమంలో చాలా జంతువులు అడవిలో కొండ చిలువలు కన్పిస్తే దూరంగా వెళ్లిపోతాయి. ముఖ్యంగా కొండ చిలువలు చెట్లపై కూడా సంచరిస్తాయి.
చెట్ల కిందకు లేదా చెట్ల కొమ్మల మీద ఉంటూ.. వాటికి కావాల్సిన ఆహరం వస్తే.. వెంటనే దాని మీదకు దాడి చేస్తాయి. కొండ చిలువలకు విషం ఉండదు కానీ.. అది దాడి చేసి అవుతల ఉండే మనుషులకు లేదా జంతువులకు గాలి ఆడకుండా, ఎముకలు విరిగిపోయేలా చేస్తుంది.
ఆ తర్వాత తన కన్న రెండింతలు ఉన్న మనిషుని కానీ.. జంతువుల్ని కానీ కొండ చిలువ అత్యంత సునాయసంగా మింగేస్తుంది. ఈ క్రమంలో ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఒక భారీ కొండ చిలువ అమాంతం చెట్టు మీదకు ఎక్కేసింది.
అది తన తోకను ఆధారం చేసుకుని అడవిలో చెట్టును బలంగా చుట్టుకుని.. చెట్లు చుట్టు తిరుగుతూ పైకి పైకి ఎక్కేసింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. బాప్ రే.. కొండ చిలువను చూస్తే భయంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు.









