Big python crossed on road in night time Video goes viral: పాములు,కొండ చిలువలు ఎక్కువగా రాత్రిపూట అడవుల్లో నుంచి బైటకు వస్తాయి. అడవులకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా కన్పిస్తాయి. పాము తమకాటులతో మనిషిని చనిపోయేలా చేస్తే, కొండ చిలువలు మనిషిపై దాడి చేసి ఊపిరాడకుండా చేసి చంపేస్తాయి. పొరపాటున వీటికి చిక్కితే నిముషాల్లోనే ప్రాణాలు పోవాల్సిందే. అందుకే ముఖ్యంగా పాములు, కొండ చిలువలతో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతుంటారు.
ఇటీవల కాలంలోచాలా మంది పాములు, కొండ చిలువల్ని పెంపుడు జంతువుల్లా పెంచుకుంటున్నారు. అవి ఎంత డెంజరో తెలిసి కూడా వాటితో చాలా చనువుగా ఉంటున్నారు. ఇదిలా ఉండగా భారీ కొండ చిలువలు ముఖ్యంగా రాత్రిపూట బైటకు వస్తాయి. ప్రస్తుతం ఒక భారీ కొండ చిలువ రోడ్డు దాటుతు కన్పిస్తుంది. అది అత్యంత భారీగా, బలంగా ఉంది.
అది ఒకవైపు నుంచి మరోక వైపుకు వెళ్తుంది. అది రోడ్డునంతా ఆక్రమించుకుని మరీ పాకుతూ వెళ్తుంది. దాన్నిచూసి అటుగా వెళ్తున్న వారు కొంత మంది తమ వాహనాల్ని రోడ్డు మీద ఆపేశారు. ఆ భారీ కొండ చిలువ మొత్తంగా రోడ్డుమీద పాకుతూ ఒకవైపు నుంచి మరోక వైపుకు వెళ్లింది. అది లైట్ల వెలుతురుకు మెరుస్తూ చాలా డెంజర్గా ఉంది.
మొత్తంగా కొండ చిలువను చూసి అక్కడున్న వారు దూరంగా పారిపోయారు. ఆ తర్వాత తమఫోన్ లలో ఈ కొండ చిలువ కదలికల్ని వీడియో తీశారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. పొరపాటున దానికి చిక్కితే.. బొక్కల్ని చుర చుర చేస్తుందంటూ సోషల్ మీడియాలో ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.









