)
Big Python found in Toilet Trending video: వానాకాలం వచ్చిందంటే పాములు, కొండ చిలువలు తరచుగా మానవ ఆవాసాల్లోకి వస్తాయి. ముఖ్యంగా ఎక్కడైతే కొండలు, చెట్లు, అడవులు ఉంటాయో అక్కడ పాములు, కొండ చిలువలకు ఆవాసంగా చేసుకుని ఉంటాయి. వీటిని దగ్గరగా ఉన్న ఇళ్లలో పాములు వస్తాయి. కొన్నిసార్లు వరద నీళ్లలో కొట్టుకుని కూడా పాములు, కొండ చిలువలు వచ్చిన ఘటనలు కొకొల్లలు. ఇటీవల పాములు వీడియోలు నెట్టింట ఎక్కువగా వైరల్ అవుతున్నాయి.
ఇంటర్నెట్ లో వీటికి విపరీమైన డిమాండ్ ఉంది. ప్రజలు కూడా వీటిని చూసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. మరొవైపు ఇటీవల ఇవి ఇళ్లలోకి దూరి బట్టలలో, బెడ్ లలో, బాత్రూమ్ల టాయ్ లెట్ నుంచి లోపలికి వస్తున్నాయి. ఇలాంటి ఒక భయానక వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. ఒక భారీ కొండ చిలువ టాయ్ లెట్ నుంచి రంధ్రం నుంచి బైటకు వచ్చింది.
అంతే కాకుండా అది అక్కడ గొడ మీద పాకుతూ రచ్చ చేసింది. ఇంతలో ఆ ఇంటి వాళ్లు గుర్తించి కొండ చిలువ కదలికల్ని వీడియో తీశారు. ఆతర్వాత స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి చాకచక్యంతో కొండ చిలువను బంధించారు.
ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. అక్కడ కూడా ప్రశాంతంగా ఉండనివ్వరా..?.. అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ఓర్నాయనో బాత్రూమ్ లో నీకేంపని అంటూ కొండ చిలువపై కామెంట్లు చేస్తున్నారు.