Python Video: వామ్మో.. బెడ్ మీద దూరిపోయిన భారీ కొండ చిలువ.. షాకింగ్ వీడియో వైరల్..

Python on bed video: భారీ కొండ చిలువ బెడ్ మీదకు ఎక్కింది. యువతి కొండ చిలువను గమనించి భయంతో అరుపులు, కేకలు పెట్టింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్ లు సైతం షాక్ అవుతున్నారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Mar 18, 2025, 06:22 PM IST
  • బెడ్ మీదకు ఎక్కేసిన కొండ చిలువ..
  • షాక్ అవుతున్న నెటిజన్లు..
Python Video: వామ్మో.. బెడ్ మీద దూరిపోయిన భారీ కొండ చిలువ.. షాకింగ్ వీడియో వైరల్..

Big python Roaming on bed video: సాధారణంగా సమ్మర్ సీజన్ లో పాములు, కొండ చిలువకు ఎక్కువగా చీకటి ప్రదేశంలో ఉండేందుకు ఇష్టపడతాయి. అందుకే అవి ఇళ్లలోనికి ప్రవేశించి.. చీకటిగా ఉండే ప్రదేశాల్లో అంటే.. సజ్జల మీద, బైక్ లలో, షూస్ లలో, రంధ్రాలలో దూరిపోయి దాక్కుంటాయి. ర్యాక్ లలో, అలమార్లలో కూడా పాములు దాక్కుని ఉంటాయి. పాముల, కొండ చిలువల వెరైటీ వీడియోలు తరచుగా నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంటాయి.

Add Zee News as a Preferred Source

నెటిజన్లు సైతం.. వీటిని చూసేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. కొండ చిలువల్ని చాలా మంది చూసేందుకు కూడా భయపడిపోతుంటారు. పొరపాటు దాన్ని పట్టుకుంటే.. ఎముకల్ని గట్టిగా చుట్టేసుకుని విరిచేస్తుంది. అది గట్టిగా చుట్టుకుని ఊపీరాడకుండా చేసి మనిషి చచ్చిపోయేలా చేస్తుంది. మొత్తంగా కొండ చిలువలు.. మేకలు,కొన్నిరకాల జీవులు,  మనుషులను కూడా అమాంతం మింగేస్తుంటాయి. ఈ నేపథ్యంలో కొంతమంది కొండ చిలువల్ని సైతం అదేదో.. పెంపడు జీవుల్లా పెంచుకుంటారు.

 

ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఒక వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.  ఒక మహిళ బెడ్ మీద పడుకుని ఉంది. మరీ వాళ్ల ఇల్లు అడవికి దగ్గరగా ఉందో.. మరేంటో కానీ.. భారీ కొండ చిలువ అక్కడకు వచ్చింది. అది బెడ్ మీదకు ఎక్కింది. మహిళ వెంటనే కొండ చిలువను గమనించింది.

Read more: Snake Bite: ఇదెక్కడి విడ్డూరం.. ఒకే వ్యక్తిని పదుల సార్లు కాటేసిన పాములు.. ఎక్కడో తెలుసా..?

గట్టిగా ఆమె అరుపులు ,కేకలు పెట్టింది. మరీ దానికి ఈమెను చూసి భయమేసిందో కానీ.. అక్కడి నుంచి దిగేసి.. తన దారిన తాను వెళ్లిపోయింది. ఆమెకు మాత్రం ఏ మాత్రం హనీ తలపెట్టలేదు. కొండ చిలువ కదలికలు అక్కడే ఉన్న సీసీకెమెరాలో రికార్డు అయ్యాయి.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News