Big Python Snake Rescue Viral Video: ప్రస్తుతం చాలా మంది స్నేక్ క్యాచర్స్ పాములు పట్టుకునే క్రమంలో వీడియోలను చిత్రీకరించి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. నెటిజన్స్ కూడా ఎక్కువగా ఇలాంటి వీడియోలనే చూసేందుకు ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా కొంతమంది నెటిజన్స్ ఇలా షేర్ చేసిన వీడియోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ కూడా అవుతున్నాయి. ఇటీవలే నెట్టింట వైరల్ అవుతున్న వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే ఈ వీడియో ఇంతలా వైరల్ అవ్వడానికి గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుతం చాలా మంది పాములను రక్షించేందుకు ప్రత్యేకమైన ఫౌండేషన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రత్యేకమైన యూట్యుబ్ ఛానెల్స్ ఏర్పాటు ప్రత్యేకంగా ఇళ్లలోకి సంచారం చేసిన పాములను రక్షిస్తూ.. వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం @murliwalehauslafoundation యూట్యుబ్ ఛానెల్ నుంచి ఇటీవలే ఓ వీడియో పోస్ట్ చేశారు. అయితే వీడియోలో వివరాల్లోకి వెళితే..
ఓ ఇంటర్ కాలేజ్ సమీపంxలో పెద్ద పైథాన్ స్నేక్ సంచారం చేస్తుంది. అయితే ఇంతలోనే కొంతమంది స్టూడెట్స్ స్నేక్ క్యాచర్స్‌కు సమాచారం అందించారు. అయితే వీరు అక్కడికి చేరుకుని.. ఓ పాత క్లాస్ రూమ్‌లోకి ఆ స్నేక్ క్యాచర్ బృదం ప్రవేశిస్తుంది. అయితే అందులో వంట సామాగ్రి, కట్టెలు ఉండడం వల్ల పామును కొద్ది సేపు వరకు గుర్తించలేకపోతారు. అక్కడే ఉండే కొంత మంది విద్యార్థులు రూమ్‌లో ఉండే సామాగ్రిని పూర్తిగా తీస్తారు. ఇంతలో స్నెక్ క్యాటర్స్‌కి పాము కనిపిస్తుంది.
స్నేక్ క్యాచర్ అక్కడే ఆ భారీ పైథాన్ ఉందని గమనించి.. దానిని పట్టుకునే ప్రయత్నం చేస్తారు. అయితే ఆ పాము అక్కడే పడుకుని ఉండడం మీరు గమనించవచ్చు. దీంతో స్నేక్ క్యాచర్ దాని తలను పట్టుకుని కాలేజ్ గ్రౌండ్‌లోకి పట్టుకుని వచ్చి, అక్కడి ఉండే స్టూడెంట్స్‌కి క్లాస్ చెబుతాడు. అంతేకాకుండా ఆ పామును ఓ సంచిలో బంధించి అక్కడి నుంచి తరలిస్తారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









