
Snake Laid 120 Eggs Viral News: పూర్వికులు యుద్ధాలు చేసే సమయంలో పాములను కూడా ఆయుధాలుగా వాడే వారట.. లక్షల కొద్ది పాములను పట్టి వ్యతిరేక సైన్యంపై విసిరేవారట.. దీంతో వారు పాము కాటుకు గురై చనిపోయేవారని అనేక చరిత్ర పుస్తకాల్లో క్లుప్తంగా రాశారు.. అందుకే అప్పట్లో పాములను చూస్తే సైన్యం కూడా వనికి పోయేదట.. అప్పట్లో రాజులు కూడా విషపూరితమైన పాములను చూసి భయపడే వారట.. ఇళ్లలో సంచారం చేసే పాములను చాలావరకు కాటేస్తుందని ముందుగానే భయపడి ధైర్యాన్ని కూడగట్టి వాటిని చంపేస్తూ ఉంటారు. జీవన వైవిధ్యంలో పాములకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది అందుకే అటవీశాఖ అధికారులు వాటిని రక్షించేందుకు ఇప్పటికీ ప్రత్యేకమైన చర్యలు చేపడుతూ వస్తున్నారు.
ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో సంచారం చేసే పాములకు ప్రత్యేకమైన ఆహారాలను కూడా అందిస్తున్నారు. అలాగే అడవి పరిసర ప్రాంతాల్లో ఉండే గ్రామాల్లో సంచారం చేసే పాములను చంపదని అటవీశాఖ లేదా అగ్నిమాపక శాఖ సిబ్బంది.. అక్కడ జీవించే ప్రజలకు సూచిస్తున్నారు. అంతేకాకుండా ఆయా ప్రాంతాల్లో ప్రత్యేకమైన క్యాంపెనింగులను కూడా చేపడుతున్నారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో పాములు పెట్టిన గుడ్లను సురక్షితమైన ప్రదేశాలకు తరలిస్తున్నారు. ఇలా పాములు వాటి గుడ్లకు సంబంధించిన అనేక వీడియోలు, వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా పాము గుడ్లకు సంబంధించిన ఓ వార్త విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆంధ్రప్రదేశ్ సమీపంలోని ఓ పట్టణంలో పాము ఏకంగా 120 గుడ్లు పెట్టింది.. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా పరిసర గ్రామమైన మల్కాపురంలో ఓ పాము ఏకంగా 120 గుడ్లు పెట్టింది అయితే ఇది అక్కడే ఉన్న కొంతమంది స్థానికులు గమనించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అధికారులు అక్కడికి చేరుకొని ఈ పాము గుడ్లను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. కొంతమంది అయితే పాము 120 గుడ్లు కూడా పెడుతుందా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే అటవీశాఖ అధికారులు ఈ గుడ్లను సురక్షితంగా ఉంచేందుకు.. ఒక ప్రత్యేకమైన ట్రేలో ఇసుక పోసి అందులో ఈ గుడ్లను భద్రపరిచారు.
కొన్ని రోజులు గడిచిన తర్వాత అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకొని.. గుడ్లను పరీక్షించగా.. అందులో చాలా గుడ్లు ఖాళీగా ఉన్నాయట. అయితే పరీక్షించి చూడగా అక్కడ చిన్న చిన్న పాములు కనిపించాయని అధికారులు చెబుతున్నారు. అక్కడే ఉండే కొన్ని పొదల్లో ఆ పాములు అటు ఇటు తిరుగుతున్నాయని అవి హానికరమైన విషం కలిగిన పాములు కావని కేవలం నీటి వనరులకు సంబంధించిన పాములని అధికారులు తేల్చేశారు. ఈ గుడ్ల సమీపంలో ఉన్న నీటి కుంటల్లోకి ఆ చిన్న పాములు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయని వారు తెలిపారు.. దాదాపు 80 పాము పిల్లలు గుడ్ల నుంచి బయటకు వచ్చినట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు ఈ పాము పిల్లలను కొన్నిటిని తోర్నాల చెరువులోకి వదిలినట్టు వారు తెలిపారు ముందు ముందు అన్ని పాములను అదే చెరువులో వదిలేయబోతున్నట్లు వెల్లడించారు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి