)
Divorced Couple Re Married: క్షణికావేశంలో.. చిన్న చిన్న కారణాలు, భేదాభిప్రాయాలతో విడిపోయిన జంటలు మళ్లీ కలిశాయి. సత్వరమే కేసులకు పరిష్కారం చూపే లోక్ అదాలత్‌లో ఊహించని సంఘటన చోటుచేసుకుంది. కేసుల మధ్య రాజీ కుదిర్చే లోక్ అదాలత్‌లో రెండు జంటలు కలుసుకున్నాయి. ఉప్పు నిప్పుగా ఉన్న భార్యాభర్తలు కలిసిపోయాయి. గతంలో జరిగిన గొడవలు, అలకలు అన్నీ మరచిపోయి మళ్లీ కలిసి ఉంటామని ప్రమాణం చేశాయి. లోక్ అదాలత్‌లో మళ్లీ పెళ్లి చేసుకున్నారు.
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాలకు చెందిన వెంకటేశ్- హరిత దంపతులకు పెళ్లయ్యి కొన్ని నెలలయ్యాయి. ఈ సమయంలో వారి మధ్య కట్నం వివాదం తలెత్తింది. ఈ వివాదం కారణంగా కొన్నాళ్లుగా వేర్వేరు జీవితం గడుపుతున్నారు. జగిత్యాల పట్టణానికి చెందిన ముస్తఫా- షిరిన్ సుల్తానా దంపతులు వరకట్నం, మెయింటెనెన్స్ కేసులు వేసుకున్నారు. అయితే కేసులు పరిష్కారం కాకపోగా.. కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. తాజాగా నిర్వహించిన లోక్ అదాలత్‌లో పై రెండు జంటలు కొత్త మలుపు తీసుకున్నారు. ఆ మలుపు వారి కాపురాన్ని తిరిగి నిలబెట్టింది. లోక్ అదాలత్ ఉద్దేశమే ఇరు వర్గాలను రాజీ కుదిర్చడం. అలా లోక్ అదాలత్‌లో జిల్లా జడ్జి, ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి చొరవ తీసుకుని ఆ దంపతులకు నచ్చజెప్పారు. కలిసి ఉంటే కలదు సుఖం అని వివరించారు.
జడ్జి నచ్చజెప్పండాతో వెంకటేష్- హరిత, ముస్తఫా - షిరిన్ సుల్తానా దంపతులు తమ కేసులు రాజీ చేసుకుని కలిసి ఉండేందుకు నిర్ణయించుకున్నారు. దీంతో ఆ రెండూ జంటలు న్యాయమూర్తి సమక్షంలో ఇరువురు మళ్లీ పెళ్లి చేసుకున్నారు. ఒక క్షణం కోర్టు హాలు కన్నీళ్లు, క్షమాపణలు, హర్షధ్వనులతో నిండిపోయింది. ఒకరికి ఒకరు పూలదండలు మార్చుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. గొడవలు.. కోపతాపాలు పక్కనపెట్టి రాజీకి రావడం.. తిరిగి తమ వైవాహిక బంధాన్ని కొనసాగించడానికి ముందు రావడంపై న్యాయమూర్తి హర్షం వ్యక్తం చేశారు. ఆ జంటలను జడ్జి అభినందిస్తూ కలహాలు ఎంత పెద్దవైనా… రాజీతోనే పరిష్కారం అని ప్రకటించారు. కలిసి ఉండే జీవితం కంటే విలువైనది ఇంకేదీ లేదు అని స్పష్టం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.