Bihar Frustrated Woman: భర్తకు ట్విస్ట్ ఇచ్చి లోన్ రికవరీ ఏజెంట్‌తో మహిళ జంప్.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..

Bihar news: బీహర్ లోని ఒక మహిళ ఇటీవల లోన్ రికవరీ ఏజెంట్ తో పారిపోయి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. గత ఏడాది నుంచి తన భర్త తాగి కొడుతున్నాడని, అతడి వేధింపులు భరించలేక మహిళ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

Written by - Inamdar Paresh | Last Updated : Feb 14, 2025, 05:12 PM IST
  • భర్తకు ట్విస్ట్ ఇచ్చిన భార్య..
  • అందుకే వెళ్లిపోయానని క్లారీటీ..
Bihar Frustrated Woman: భర్తకు ట్విస్ట్ ఇచ్చి లోన్ రికవరీ ఏజెంట్‌తో మహిళ జంప్.. వెలుగులోకి షాకింగ్  విషయాలు..

Bihar woman frustrated with alcoholic husband: కొంత మంది ఇటీవల పెళ్లిచేసుకుని వింతగా ప్రవర్తిస్తున్నారు. ఏడడుగులు నడిచి, ఒకరికి మరోకరు జీవితాంతం తోడు ఉంటామని చెప్పుకొని ఒకర్ని మరోకరు మోసం చేసుకుంటున్నారు. పెళ్లి బంధానికున్న గొప్పతనాన్ని తుంగలో తొక్కుతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం చాలా మంది మహిళలు.. పురుషులు అని తేడాలేకుండా వివాహేతర సంబంధాలు పెట్టు కుంటున్నారు.

Add Zee News as a Preferred Source

 

ఒకరికి తెలియకుండా.. మరోకరు సీక్రెట్ యవ్వారాలు నడిపిస్తున్నారు. కొంతమంది పెళ్లి చేసుకున్న వారిని వేధిస్తున్నారు. తాగి తమ భార్యలపై దాడులు చేస్తున్నారు. ఇక మహిళలు.. తమకు బంగారం, నగలు కొనివ్వడంలేదని, సరిగ్గా చూసుకొవడంలేదని భర్తల్ని వేధిస్తున్నారు. దీంతో పెళ్లి చేసుకున్నాక కూడా పక్క చూపులు చూస్తున్నారు. ఈ క్రమంలో బీహార్ లోని జముయ్ లో చోటు చేసుకున్న ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. 

కర్మటాండ్ గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని ఏడాది క్రితం మహిళ పెళ్లి చేసుకుంది. పెళ్లైన ప్పటి నుంచి అతగాడు.. తాగి వేధింపులకు గురిచేసేవాడు. శారీరకంగా హింసలు పెట్టేవాడు. చీర కట్టుకున్న అనుమానం పెట్టుకునేవాడు. దీంతో ఆమె విసిగిపోయింది. చివరకు లోన్ రికవరీ ఏజెంట్ తో పరిచయం ఏర్పడింది. అతడితో పరిచయం కాస్త ప్రేమగా మారింది. చివరకు ఇద్దరు కలిసి లేచీ పోయి పెళ్లి కూడా చేసుకున్నారు.

Read more: Viral Video: మాజీ ప్రియుడికి 100 పిజ్జాలు ఆర్డర్ పెట్టిన యువతి... ట్విస్ట్ ఏంటంటే..?.. వీడియో వైరల్..

అయితే.. సదరు మహిళ ఏడాది పాటు తన భర్త మారతాడని ఎంతో వేచి చూసిందంట. కానీ అతను మాత్రం ప్రతిరోజు తాగి కొట్టేవాడని ఆమె వెల్లడించింది. భర్త ఇంట్లో వాళ్లకు చెప్పిన కూడా వాళ్లు పట్టించుకోలేదని, ఇలాంటి వ్యక్తితో జీవితం అనేది మునిగే పోయే నావ మీద ప్రయాణం లాంటిదని.. సదరు మహిళ వాపోయింది. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు మహిళ చెప్పింది. ఈ క్రమంలో మహిళ వ్యవహారం మరోసారి వార్తలలో నిలిచింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News