Lady Police Video: డ్రైవింగ్ చేస్తు రెచ్చిపోయిన అందమైన పోలీస్.. విధుల్లో ఉండగానే ఆ పని.. షాకింగ్ వీడియో వైరల్..

Bihar lady sub inspector: బీహర్ కు చెందిన లేడీ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌ చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమెపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Mar 4, 2025, 05:49 PM IST
  • బీహర్ లో రెచ్చిపోయిన లేడీ పోలీసు..
  • సీరియస్ అయిన ఉన్నతాధికారులు..
Lady Police Video: డ్రైవింగ్ చేస్తు రెచ్చిపోయిన అందమైన పోలీస్.. విధుల్లో ఉండగానే ఆ పని.. షాకింగ్ వీడియో వైరల్..

Bihar woman sub inspector making reels video: సోషల్ మీడియాలో ఫెమస్ అయ్యేందుకు ఇటీవల చాలా మంది రీల్స్, వీడియోలు చేసి పోస్ట్ చేస్తున్నారు.  ఈ క్రమంలో బస్టాండ్ లు, రైల్వే, మెట్రోలు, ఎయిర్ పోర్టులు, రద్దీగా ఉన్న ప్రదేశాలు ఇలా.. ప్రతి చోట రీల్స్ చేస్తు రచ్చ చేస్తున్నారు. మొత్తంగా కొంత మంది అతిగా ప్రవర్తిస్తున్నారు. ఎత్తైన ప్రదేశాలు, జలపాతాలు, కొండ ప్రాంతాల దగ్గరకు వెళ్లి పిచ్చి,పిచ్చి చేష్టలతో రీల్స్ చేస్తున్నారు.  దీని వల్ల తమప్రాణాలను డెంజర్ లో నెట్టుకుంటున్నారు. మరికొందరు రీల్స్ పిచ్చిలో పడి అసలు తాము ఏంచేస్తున్నామో అన్న విషయం కూడా మర్చిపోతున్నారు.

Add Zee News as a Preferred Source

 

చాలా మంది తమ రోజు వారి యాక్టివిటీనీ ఇటీవల సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పోస్ట్ లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక లేడీ పోలీసు అధికారిణి ప్రియాంక గుప్త చేసిన పని ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. సాధారణంగా ఏ డిపార్ట్ మెంట్ లో అయిన పనివేళలో తమకు కేటాయించిన డ్యూటీలను సక్రమంగా చేయాలని చేప్తుంటారు. కానీ కొంత మంది మాత్రం.. వర్కింగ్ అవర్స్ లో.. రీల్స్, వీడియోలు తీస్తు ఇటీవల కాంట్రవర్సీలకు కారణమౌతున్నారు.

మొత్తంగా ప్రస్తుతం ఒక బీహార్ క్యాడర్ లేడీ ఇన్స్ పెక్టర్ సైతం ఇటీవల వివాదంలో చిక్కుకుంది. ఆమె చేసిన పని ఉన్నతాధికారుల  వరకు వెళ్లింది. ఈస్ట్ చంపారన్ పహార్ పూరకు పీఎస్ చెందిన లేడీ సబ్ ఇన్స్ పెక్టర్  ప్రియాంక గుప్తకు తరచుగా రీల్స్ చేసి తన సోషల్ మీడియాలో అకౌంట్ లో పోస్ట్ లు చేయడయం అలవాటు. అయితే.. ఇటీవల ఆమె విధి నిర్వహణలో ఉండగా.. అది కూడా డ్రైవింగ్ చేస్తు రీల్స్ రికార్డు చేసింది.

Read more: MLA Abu Azmi: ఔరంగజేబ్‌ గొప్పవాడంటూ ఎమ్మెల్యే ప్రశంసలు.. మహారాష్ట్రలో రాజుకున్న వివాదం..  

అది కూడా ఆమె విధి నిర్వహణలో , యూనీఫామ్ లో ఉండగా.. రీల్స్ చేయడంతో ఇది వివాదంగా మారింది. ఇది కాస్త వైరల్ కావడంతొ.. ఉన్నతాధికారుల వరకు వెళ్లింది. ఒక వైపు డ్రైవింగ్లో జాగ్రత్త పాటించకుండా రీల్స్ చేయడం, మరోవైపు యూనీఫామ్ లో విధి నిర్వహణలో ఉండి కూడా రీల్స్ చేయడం పట్ల ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. సదరు లేడీ ఇన్స్ పెక్టర్ ను సస్పెండ్ చేస్తు ఉత్తర్వులు జారీ చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News