
Bike riders molested girls on busy road in Panipat Uttar Pradesh video: కొంత మంది కామాంధులు పశువుల కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు. బస్టాండ్ లు, రైల్వే స్టేషన్, మెట్రోలు , రద్దీగా ఉండే ప్రదేశాల్లో టీనేజ్ అమ్మాయిల్ని టార్గెట్ చేసుకుని వేధింపులకు గురిచేస్తున్నారు. అసలు పసి పాప నుంచి పండు ముసలి వరకు ఏ ఒకర్నిసైతం వదలడం లేదు. మొత్తంగా పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్న కూడా వీరిలో మార్పులు మాత్రం రావడంలేదు.
ఈ క్రమంలో తాజాగా.. ఉత్తర ప్రదేశ్ లోని పానిపట్ జిల్లాలోని జిటి రోడ్డులో దారుణం చోటు చేసుకుంది. రోడ్డు దాటుతున్న అమ్మాయిల్ని ఇద్దరు బైకర్ లు వేధించారు. రోడ్డు దాడుతున్న టీనేజ్ అమ్మాయిల్ని వెనక వైపు నుంచి తాకుతూ, కొడుతూ జుగుప్సాకరంగా ప్రవర్తించారు.
In Panipat, two youths tried to touch a girl inappropriately while she was crossing the road. The incident was caught on video, went viral, and police swiftly arrested both within hours.#PanipatPolice #ZeroTolerance #WomenSafety #JusticeServed #StopHarassment pic.twitter.com/UdWPHokSOV
— The Daily Guardian (@DailyGuardian1) August 26, 2025
ఆ తర్వాత నవ్వుతూ, వారి వంక చూస్తు పైశాచీకంగా ప్రవర్తించారు. ఈ అనూహ్య ఘటనతో యువతులు షాక్ కు గురయ్యారు. తెరుకునే లోపు అక్కడి నుంచి బైకర్స్ వెళ్లిపోయారు. దీంతో సదరు బాధితులు.. ఈ ఘటన గురించి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఘటన స్థలంలోని సీసీ కెమెరాల్ని పరిశీలించి కేటుగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత పోలీసులు ఆకతాయిల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో తమదైన శైలీలోట్రిట్మెంట్ ఇచ్చారు. ఈ వేధింపులకు చెందిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.