)
Nagamani Viral Video Watch Now: పాములకు సంబంధించిన కొన్ని విషయాలు ఇప్పటికి రహస్యంగానే ఉన్నాయి. పురాణాల్లో నాగలోకం గురించి ఎంతో క్లుప్తంగా వివరించారు. పాముల ప్రపంచాన్ని నాగలోకంగా పిలుస్తారని కూడా అందులో పేర్కొన్నారు. ఈ పాముల ప్రపంచంలో ఎన్నో రకాల జాతులకు సంబంధించిన పాములు ఉండేవని సమాచారం. ఆ సమయంలోనే నాగమణిలు కూడా పాములకుండేవట.. ఇలా నాగలోకం, నాగమణి వజ్రానికి సంబంధించిన అనేక రహస్యాలను పురాణాల్లోని కొన్ని పుస్తకాల్లో రాశారు.
ముఖ్యంగా పురాణాల్లో నాగమణికి సంబంధించిన ప్రత్యేకతను, దాని ప్రాముఖ్యతను ఎంతో క్లుప్తంగా వివరించారు.. కానీ ఇది నిజంగా ఎలా ఉంటుందో అనేది చాలామందికి తెలియదు. అయితే దీనిని కొంతమంది మాత్రమే ఇప్పటికీ చూశారని.. నాగమణితో తయారు చేసిన ఆభరణాలు ధరించారని సమాచారం. నిజానికి నాగమణితో తయారుచేసిన ఎలాంటి ఆభరణాలు ధరించిన ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఈ గొప్ప శక్తులు కలిగిన రత్నం ధరిస్తే ఎలాంటి పనులైన నిర్విఘ్నంగా విజయవంతం అవుతాయి. అలాగే ఆరోగ్యం కూడా ఎంతో బాగుంటుంది.
సాధారణంగా నాగమణులు తొమ్మిది రకాల పాముల తలభాగాలపై పెరుగుతాయని సమాచారం. ఇవి కలిగిన పాములు అత్యంత శక్తివంతంగాను, చాలా విషపూరితమైనవిగా చెప్పుకుంటూ ఉంటారు. సాధారణంగా నాగమణి ఉన్న పాములను గుర్తించడం చాలా సులభం. ఎందుకంటే ఈ రత్నం కలిగిన పాములు రాత్రి సమయాల్లో కాంతిని కలిగి ఉంటాయి.. పాముల తల భాగంలో అద్భుతమైన కాంతితో విలవిల మెరుస్తూ ఈ పాములు కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి పాములు కనిపించడం చాలా అరుదు..
తాజాగా సోషల్ మీడియాలో అత్యంత అరుదైన నాగుపాముకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.. ఇందులో ప్రమాదకరమైన ఓ నల్ల నాగుపాము నాగమణికి కాపలాగా ఉండడం మీరు చూడొచ్చు. ఈ వీడియోలో ఆ నల్ల నాగుపాము మిల మిల మెరుస్తున్న అరుదైన నాగమణికి కాపలాగా నిలబడి పడగవిప్పి ఉండడం మీరు గమనించవచ్చు. అయితే ఈ వీడియోని ఎవరు తీసారో తెలియదు కానీ.. యూట్యూబ్‌లో అప్లోడ్ చేశారు.. దీనికి సంబంధించిన వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది అరుదైన నాగమణి కలిగిన నాగుపాము అని చాలామంది కామెంట్లు పెడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి