)
Black King Cobra In Commode Video Watch Here: అడవికి దగ్గరగా జీవించే ప్రాంతాల్లో నివాసముంటున్న ఇళ్లలోకి పాములు ఎప్పుడు ఎలా సంచారం చేస్తాయో ఎవరికీ తెలియదు. ఎక్కడి నుంచి పడితే అక్కడ నుంచి సంచారం చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఎక్కువగా ఇంటి బయట నిర్మించిన టాయిలెట్స్‌లోకి వెళ్లి హంగామా సృష్టిస్తూ ఉంటాయి. ఇలాంటి ఘటనే ఇప్పుడు రాజస్థాన్‌లోని రెసిడెంట్ డాక్టర్ హాస్టల్ టాయిలెట్లో జరిగింది. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌గా మారింది. టాయిలెట్ కమోడ్ లోని అత్యంత ప్రమాదకరమైన నల్ల కింగ్ కోబ్రా సంచారం చేసింది. అయితే ఇప్పుడు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో మనం తెలుసుకుందాం.
రాజస్థాన్‌లోని నయాపూర ప్రాంతంలో జీకే లోన్ హాస్పిటల్ రెసిడెంట్ డాక్టర్ల హాస్టల్ ఉంది. అయితే, ప్రతిరోజు MBBSs డాక్టర్స్ అంత ఇక్కడి నుంచి ఆసుపత్రికి వెళ్లి విధులు నిర్వహిస్తూ ఉంటారు. సెప్టెంబర్ 14వ తేదీ అర్ధరాత్రి ఓ డాక్టర్ డ్యూటీ చేసి హాస్టల్‌కి తిరిగి వచ్చాడు. ఫ్రెష్ అప్ అవ్వడానికి బాత్రూంలోకి వెళ్లగా అక్కడ అతడికి మృత్యుదేవత వెల్కమ్ చెప్పింది. ముందుగా ఆయన అక్కడున్న పామును గుర్తించలేకపోయాడు. అయితే చిన్న శబ్దం రావడంతో పాము పై కన్ను పడింది. దీంతో అతను టాయిలెట్ కమోడ్లు ఏదో ఉందని చూడగా అత్యంత ప్రమాదకరమైన బ్లాక్ కింగ్ కోబ్రా కనిపించింది.
कोटा : रेजिडेंट डॉक्टर्स होस्टल के बाथरूम में बैठे कोबरा ने मचाई दहशत, स्नेक केचर ने किया रेस्क्यू#video | #rajasthan | #kota pic.twitter.com/jJawzF7fCi
— Khushbu_journo (@Khushi75758998) September 15, 2025
దీంతో వెంటనే ఆ యువ డాక్టర్ హాస్టల్లో ఉన్న ఇతర డాక్టర్లకు కూడా సమాచారం అందించగా వారందరూ అక్కడికి చేరుకున్నారు. అయితే, టాయిలెట్ కమోడ్‌లో ఉన్న ఆ బ్లాకింగ్ కోబ్రాన్ని బయటికి రప్పించేందుకు అందరు దానిపై నీటిని పోస్తారు. ఆ పాముపై నీరును పోయాగా.. ఆగ్రహానికి గురై పాము బయటికి వచ్చింది. దీంతో డాక్టర్లంతా భయంతో పరుగులు పెట్టారు. ఇలా చూస్తుండగానే ఆ పాము అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించింది. ఇప్పుడు దీనికి సంబంధించిన దృశ్యాలే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ వస్తున్నాయి.
వెంటనే అక్కడున్న డాక్టర్లు స్నేక్ క్యాచర్స్‌ను సమాచారం అందించి.. తర్వాత అక్కడికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. గోవింద్ శర్మ అని స్నేక్ క్యాచర్ అక్కడికి చేరుకొని ఆ పాముని ఎంతో కష్టపడి కట్టుకున్నారు. ఇలా పట్టుకున్న పామును సురక్షితమైన అడవిలో విడిచిపెట్టినట్లు తెలిపారు. సాధారణంగా చూడకుండా కమోడ్ పై కూర్చుంటే పాము తప్పకుండా కాటేసి ఉండేది. కాబట్టి వాష్ రూమ్‌కి వెళ్లినప్పుడు ఒకటికి రెండుసార్లు గమనించడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి