Viral Video: వామ్మో.. జూలో పెద్ద పులుల ముందు జారీ పడ్డ బాలుడు.. వైరల్‌గా మారిన చెమటలు పట్టిస్తున్న వీడియో..

Tiger attacks video: జూలో ఫ్యామిలీ సరదాగా గడిపేందుకు వెళ్లారు. బాలుడు పులులు ఉన్న రీలింగ్ మీద నుంచి దూరంగా చూస్తు ఉండిపొయాడు. ఇంతలో అతని కాలు స్లిప్ అయ్యింది. డైరెక్ట్ గా పులులు ఉన్న బోనులో పడిపోయాడు. ఈ వీడియో చూసి నెటిజన్ లు  భయంతో వణికిపోతున్నారు..  

Written by - Inamdar Paresh | Last Updated : Apr 4, 2025, 06:50 PM IST
  • పులుల ముందు జారీపడ్డ బాలుడు..
  • నెట్టింట వైరల్గా మారిన వీడియో..
Viral Video: వామ్మో.. జూలో పెద్ద పులుల ముందు జారీ పడ్డ బాలుడు.. వైరల్‌గా మారిన చెమటలు పట్టిస్తున్న వీడియో..

Boy falls infront of tigers cage in zoo ai video: ప్రస్తుతం ప్రతి ఒక్కరి లైఫ్ చాలా బిజీ అయిపోయింది. ఏమాత్రం గ్యాప్ దొరికిన కూడా కొత్త ప్రదేశాలకు తమ ఫ్యామిలీ, కుటుంబాలతో వెళ్లేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. కొంత మంది హోటల్స్ కు వెళ్తే, మరికొందరు కొత్త ప్రదేశాలకు వెళ్తారు. ఇంకొందరు నేరుగా జూలకు, వాటర్ ఫాల్స్ ఉన్న ప్రదేశాలకు వెళ్తుంటారు. అయితే.. కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు ముఖ్యంగా పిల్లలు ఉంటే ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న కూడా.. తమ ప్రాణాలు చూస్తుంగానే గాల్లో కలిసిపోయే ప్రమాదం ఉంటుంది.

Add Zee News as a Preferred Source

ముఖ్యంగా ఇటీవల కాలంలో చాలా మంది డెంజరస్ ప్రదేశాలకు వెళ్లి చాలా అజాగ్రత్తగా ఉంటున్నారు. జూలకు వెళ్లినప్పుడు కొంత మంది జంతువులను చూస్తు సరదాగా ఉంటారు.మరికొందరు జంతువులను రాళ్లతో కొడుతూ టీజ్ చేస్తుంటారు. జంతువులపైన దాడులు చేస్తారు.  మూగజీవాలకు కోపం తెప్పిస్తారు. ఇలాంటి సమయంలో చాలా మంది తమ ప్రాణాలను రిస్క్ లో పెట్టకున్న వీడియోలు గతంలో వైరల్ గా మారాయి.

 

వీటిల్లో కొన్నిసార్లు తల్లిదండ్రుల నెగ్లీజెన్సీ ఉంటే.. మరికొన్నిసార్లు పిల్లలు ఉన్న చోట ఉండకుండా.. వారి ఇంట్లో వాళ్లకు చుక్కలు చూపిస్తారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఒక జూకు చెందిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఒక బాలుడు.. జూలో రీలింగ్ మీద కూర్చుని ఉన్నాడు.ఇంతలో అతని కాలు జారీ పెద్ద పులుల ముందు పడ్డాడు. పెద్దపులులు గాండ్రిస్తు.. బాలుడి చుట్టు చేరి అతనిపై దాడికి ప్రయత్నించాయి. అక్కడ ఉన్న టూరిస్టులు గట్టిగా సాయం కోసం అరుపులు కేకలు పెట్టారు.

Read more: Cobra Snake Video: పనస కాయల చోరీకి వెళ్తే.. పాము చేతిలో అడ్డంగా బుక్కైయ్యాడుగా..!.. వైరల్‌గా మారిన ఫన్నీ వీడియో..

అయితే.. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఇది ఒక అవగాహన కల్పించే ఉద్దేష్యంతో చేసిన వీడియో. ముఖ్యంగా ప్రస్తుతం సమ్మర్ సీజన్ నడుస్తోంది. చాలా మంది కుటుంబాలు తమ పిల్లలతో కొత్త ప్రదేశాలకు వెళ్తుంటారు. అలాంటి సమయలో ఏమాత్రం ఏమరు పాటున ఉన్నా కూడా.. లేని సమస్యలు కొని తెచ్చుకొవాల్సి ఉంటుందని అవగాహన కల్పించే ఉద్దేష్యంతో  ఈ వీడియోను తీసినట్లు తెలుస్తొంది. మొత్తంగా సడెన్ గా ఈ వీడియోను చూసిన నెటిజన్ లు మాత్రం వామ్మో.. ఇది నిజంగా జరిగిందా అన్న భయంతో ఈ వీడియోను చూశారు.ఈ అవగాహన వీడియో నెట్టింట ట్రెండింగ్ గా మారింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News