)
Boy kisses cobra snake Video going viral: ఇటీవల పాముల వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా వానాకాలంలో పాములు ఎక్కువగా జనావాసాల్లోకి వస్తాయి. చాలా మంది పాముల్ని చూసి దూరంగా పారిపోతారు. మరికొంత మంది పాములతో ఆటలు ఆడుకుంటు ఉంటారు. ముఖ్యంగా కోబ్రాలను తమ చేతిలో పెట్టుకుని స్టంట్ లు కూడా చేస్తారు.
కొన్నిసార్లు ఈ స్టంట్ లు వారి ప్రాణాల మీదకు కూడా వచ్చిన ఘటనలు ఉన్నాయి. మరోవైపు పాముకాటుతో చాలా మంది చనిపోతున్న ఘటనలు ఇటీవల ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి. ఎంత చెప్పిన కూడా కొంత మంది పాములతో ఇటీవల రిస్క్ లు చేస్తున్నారు. ఫెమస్ అయ్యేందుకు వీడియోలు, రీల్స్ చేసుకుంటున్నారు.
దీని వల్ల సోషల్ మీడియాలో వ్యూస్, కామెంట్లు వస్తాయని తెగ రిస్క్ లు చేస్తున్నారు. ప్రస్తుతం ఒక యువకుడు పామును ముద్దులు పెట్టుకుంటు రిస్క్ చేశాడు. ఇది వైరల్గా మారింది. బాలుడు పబ్లిక్ లో పామును తీసుకుని వచ్చాడు. మరీ అది పెంపుడు పామో.. దాని కోరలు పీకేశారో తెలీదు కానీ.. మొత్తంగా ఆ పామును అతను తన నోటితో కిందకు వంచి దాని పడగ మీద ముద్దులు పెడుతున్నాడు.
ఏ మాత్రం భయంలేకుండా నోటితో పాము తల మీద ముద్దు పెడుతూ, అందరి ముందు స్టంట్ లు చేశాడు. ఈ ఘటనను అదేదో ఘనకార్యం అన్నట్లు దీన్ని వీడియో తీశాడు. ఇది కాస్త నెట్టింట వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు సీరియస్ అవుతున్నారు. అది పొరపాటున కాటు వేస్తే ప్రాణాలు సెకన్లలో పోతాయ్ రా అంటూ.. కామెంట్లు చేస్తున్నారు.