Boy Pulling A Lion By Tail Viral Video: సింహం పేరు వినగానే అందరికీ వెన్నులో వణుకు పుడుతుంది. సింహాన్ని అడవికి రాజుగా కూడా భావిస్తారు. చాలా మంది వీటిని చూడడానికి జంగల్ సఫారీ కూడా చేస్తున్నారు. ప్రస్తుతం ఆడవుల్లో నీటి వనరులు, ఆహార వనరులు తగ్గడం వల్ల చాలా జంతువులు చనిపోతున్నాయి. మరికొన్ని జంతువులైతే.. అడవులకు స్థానికంగా ఉన్న ఊళ్లలోకి సంచారం చేస్తున్నాయి. పులుల నుంచి సింహాల వరకు అతి భయంకరమైన జంతువులు కూడా ఇళ్లలోకి వస్తున్నాయి. గతంలో ఇలా వచ్చిన సింహాలకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.. అయితే సింహాలకు సంబంధించిన పిల్లలు కూడా అప్పుడప్పుడు జనావాసాల్లోకి సంచారం చేసి.. తిరిగి అడవుల్లోకి వెళ్లలేకపోతున్నాయి. ఇలా చాలా పిల్లలు ఊళ్లలోకి వచ్చి అనేక సంఘటనలు ఉన్నాయి. అయితే కొంతమంది వీటిని పెంచి పెద్ద కూడా చేస్తున్నారు.
సింహాల పిల్లలను చాలా మంది పెంచుకుంటూ ఉంటారు. మన భారతదేశంతో పోలిస్తే.. ఇతర దేశాల్లో ఈ పిల్లలను ఎక్కువగా పెంచుకుంటూ ఉంటారు. అయితే భారత్‌లో ఇప్పటికీ కొంతమంది సింహాల పిల్లలను పెంచుకుంటూ ఉంటున్నారు. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తరచుగా వైరల్ అవుతూ వస్తున్నాయి. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఓ పెద్ద పెంచుకున్న సింహాన్ని చూడొచ్చు. అంతేకాకుండా ఓ బాలుడు కూడా కనిపిస్తాడు. ఈ వీడియోకి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఓ బాలుడు సింహ తోకను పట్టుకుని లాగడం కూడా మీరు గమనించవచ్చు.
ఈ వీడియోలో బాలుగు సింహం తోకను పట్టుకుని లాగడం మీకు కనిపిస్తాడు. సింహం కూడా దీనిని గమనించి ముందుకు వెనకకు కదలడం చూడొచ్చు. అయితే ఇదే సమయంలో సింహం ముందుకు వెళ్లడం వల్ల బాలుడు కింద పడిపోవడం కూడా గమనించచవచ్చు. అక్కడే ఉన్న ఓ యువకుడు ఆ బాలుడిని వెంటనే లేపుతాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ వస్తోంది. దీనిని చూసిన నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికీ ఈ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న వీడియోను మూడు లక్షల మందికిపైగా నెటిజన్స్ వీక్షించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ వీడియో చూసిన చాలా మంచి కామెంట్స్ కూడా చేస్తున్నారు. కొంతమందైతే "ఈ బాలుడు సింహాన్ని లాగడం చూస్తుంటే బాగా నవ్వు తెప్పిస్తోందని" కామెంట్స్ చేస్తున్నారు. ఇంట్లో ఇలాంటి జంతువులను కూడా పెంచుకుంటారా? మిమ్మల్ని ఫారెస్ట్ ఆఫీసర్లు ఏం అనడం లేదా? అని కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ సింహానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









