
boy sleeps on teen girl shoulder in metro rail video: ఇటీవల కాలంలో మెట్రో ట్రైన్ల లో వింత ఘటనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా టీనేజ్ యువతీ, యువకులు రచ్చ రచ్చ చేస్తున్నారు. చుట్టుపక్కల పబ్లిక్ ఉన్నారని సంగతి మర్చిపోతున్నారు. మెట్రోలో రొమాన్స్ చేసుకుంటున్నారు. ముద్దులు పెట్టుకుంటున్నారు . హగ్ లు ఇచ్చుకుంటున్నారు. అంతటితో ఆగకుండా.. నాలుగు గోడల మధ్య చేయాల్సిన పనుల్ని సైతం .. అందరి ముందే పబ్లిక్ గా చేస్తున్నారు. ఇటీవల కాలంలో మెట్రో లిప్ట్ లు ఇతర ప్రదేశాలు సైతం., లవర్స్ రొమాన్స్ లు చేసుకొవాడానికి అడ్డాలుగా మారాయి. ఈ క్రమంలో చాలా మంది మెట్రోలో ఎక్కుతుంటారు.
అయితే.. కొంత మందికి కూర్చొవడానికి ప్లేస్ దొరుకుటుంది. కానీ మరికొందరు మాత్రం అలానే నిల్చొని జర్నీ చేస్తుంటారు. చాలా మంది అమ్మాయిలకు కూర్చునేందుకు సీట్ ఇస్తుంటారు. అయితే.. మెట్రోలో కొన్నిసార్లు వెరైటీ ఘటనలు జరుగుతుంటాయి. ప్రస్తుతం ఒక యువతి మెట్రోలో ప్రవర్తించిన తీరు నెట్టింట హల్ చల్ గా మారింది. ఇక్కడ ఒక యువతి మెట్రోలో ప్రయాణిస్తుంది. అయితే.. ఆమె ముందుకు ఒక యువకుడు.. నిద్రపోతున్నాడు.
Moment hai bhai moment hai ? pic.twitter.com/QL8frftA9e
— Vijay (@veejuparmar) April 12, 2025
నిద్రపోయి ఎన్ని రోజులైందో.. కానీ కునుకు పాట్లు పడుతున్నాడు. ఈ క్రమంలో యువతి అతని దగ్గరకు వెళ్లింది. అంతటితో ఆగకుండా.. అతని తలను తన భుజంమీద పెట్టుకుంది. చిన్న పిల్లాడికి మెత్తని దిండు తల కిందకు పెట్టినట్లు.. అతనికి వెళ్లి సపోర్ట్ గా నిలబడింది. ఇంతలో అతను ఒక్కసారిగా మెళకువ రావడంతో లేచాడు. యువతి తన ముందు ఉండటం చూసి అతని నిద్రదెబ్బకు ఉలిక్కిపడ్డాడు. ఆమె మాత్రం నవ్వుతూ అక్కడే నిలబడింది.
మరీ ఇది నిజంగా జరిగిందో లేదా ప్రాంక్ వీడియోనో కానీ.. మొత్తంగా యువతి చేసిన పని మాత్రం నెట్టింట హల్ చల్ గా మారింది.ఈ వీడయో చూసిన నెటిజన్లు మాత్రం యువతి గొప్ప మనసుకు ఫిదా అవుతున్నారు. ఇది భయ్యా.. నిజమైన మనస్సు అంటూ ఆమెపై ప్రశంసిస్తున్నారు. ఇలాంటి అమ్మాయిలు దొరికితే లైఫ్ జిల్ జిల్ జిగా.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe