Anaconda Snake Video: నువ్వు మగడివిరా బుగ్గిగా.. ఉత్తి చేతులతో కాలువలో కొండచిలువను పైకి లాగేశాడు.. వీడియో ఇదే చూడండి!

Big Anaconda Snake Video Viral: ఓ స్నేక్ క్యాచర్ కాలువలో ఉన్న పెద్ద పామును బయటికి తీస్తున్న సన్నివేశాలు ఇప్పుడు సోషల్ మీడియాలో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఏమాత్రం భయం లేకుండా ఆ యువకుడు ఉత్తి చేతులతో పామును బయటికి లాగడం ఈ వీడియోలో చూడవచ్చు. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Mar 15, 2025, 01:34 PM IST
Anaconda Snake Video: నువ్వు మగడివిరా బుగ్గిగా.. ఉత్తి చేతులతో కాలువలో కొండచిలువను పైకి లాగేశాడు.. వీడియో ఇదే చూడండి!

Giant Anaconda Snake Viral Video: సాధారణంగా పాములు ఏవైనా జంతువులను లేదా వాటికి కావాల్సిన ఆహారాలపై దాడి చేసే క్రమంలో వాటికవి మర్చిపోయి కొన్నిసార్లు బావులు, కాల్వల్లో పడుతూ ఉంటాయి. ఇలా తరచుగా జరగడం సర్వసాధారణం. ముఖ్యంగా కింగ్ కోబ్రాలతో పోలిస్తే కొండచిలువలకు తరచుగా జరుగుతూ ఉంటాయి. తాజాగా వైరల్ అవుతున్న వీడియో కూడా దీనికి సంబంధించిందే.. ఓ కొండచిలువ ఆహారం కోసం వెతుక్కుంటూ వెళ్తూ ఏకంగా పెద్ద కాలువలో పడిపోయింది అయితే దీనిని ఓ యువకుడు ఏమాత్రం భయం లేకుండా ఎత్తి పైన వేసే ప్రయత్నం చేస్తున్నాడు దీనికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Add Zee News as a Preferred Source

కొండచిలువలు చాలా నెమ్మదిగా ఒకచోటి నుంచి మరొక చోటికి ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఇవి అన్ని పాముల కంటే చాలా భిన్నంగా ఉంటాయి. భారీ ఆకారం కలిగిన ఈ పాములు జంతువులను తనకున్న పెద్ద నోరుతో ఒకే ఒకసారి నమిలి మింగేయగలవు. అందుకే ఈ కొండచిలువలను ప్రమాదకరమైన పాములుగా కూడా పిలుస్తారు. అయితే ఇటీవలే ఓ కొండచిలువ పాము ఆహారం కోసం ఒకచోటి నుంచి ఒక చోటికి వెళ్తుండగా ఓ పెద్ద కాలువలో పడిపోయింది. దీంతో అక్కడున్న కొంతమంది స్థానికులు గమనించి స్నేక్ క్యాచర్స్‌కి ఇన్ఫర్మేషన్ అందించారు. దీంతో వారు అక్కడికి చేరుకొని ఆ పామును పైకి లాగే ప్రయత్నం చేశారు. ఓ స్నేక్ క్యాచర్ ఏ మాత్రం భయపడకుండా కాలువలో ఉన్న పామును ఒక్కడే పైకి తీసే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

ఈ వైరల్ అవుతున్న వీడియోను  'విశాల్ స్నేక్ సేవర్' అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ చిన్న క్లిప్పులో.. ఒక పెద్ద పాము ఉండడం మీరు గమనించవచ్చు.. అలాగే ఓ యువకుడు కూడా ఎంతో ధైర్యంగా నీటిలో చేయి పెట్టి కొండచిలువను బయటకు సంరక్షించడం మీరు గమనించవచ్చు. ఆ పెద్ద కొండచిలువను ఆ యువకుడు లాగుతూ ఉండడం మీరు చూడవచ్చు. నిజానికి స్నేక్ క్యాచర్స్ ఎంతో ధైర్యవంతులు. వారి ఎంత పెద్ద పాములనైనా పట్టుకొని రక్షించే ధైర్యాన్ని కలిగి ఉంటారు. అయితే ఈ క్రమంలో చాలామంది వాటి దాడికి గురైన వారు కూడా ఉన్నారు. ఏది ఏమైనా ఇలాంటి పాములను పట్టుకునే క్రమంలో తప్పకుండా జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. ఆ యువకుడు పామును బయటికి తీస్తున్న సమయంలో అక్కడే ఉన్న కొంతమంది ఈ దృశ్యాలను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆ వీడియోలు కూడా విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Also Read: Huge King Cobra Video: వీడే అసలైన మగాడ్రా బామ్మర్ది.. 10 అడుగుల కింగ్ కోబ్రాను ఉత్తి చేతులతో పట్టుకున్నాడు.. వీడియో చూశారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News