Bride enjoying alcohol and smoking cigarette video: ఇటీవల కాలంలో యువతీ, యువకులు వింత పోకడలకు పోతున్నారు. మొత్తంగా పెళ్లి అనే పవిత్ర బంధానికి మాయని మచ్చగా మారుతున్నారు. ఇటీవల జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే..పెళ్లి అంటేనే కిలోమీటర్ దూరంగా యువతీ, యువకులు పారిపోతున్నారు.
కొంత మంది భార్యలు తమ భర్తల్ని చంపుతున్నారు. మరికొన్ని చోట్ల.. భర్తలు తమ భార్యల్ని హత్యలు చేస్తున్నారు. కొంత మంది ఇలాంటి తప్పులు చేసిన కూడా.. మొత్తంగా చాలా మంది పెళ్లిని అందరు దూరంగా పెడుతున్నారు. దీని ప్రభావం కూడా భవిష్యత్ తరాలపై ఉంటుందని చెప్పుకొవచ్చు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పెళ్లి వీడియోలు ఎక్కువగా నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. మరీ కావాలని చేస్తున్నారో లేదా పబ్లిసిటీ కోసం చేస్తారో కానీ.. మొత్తంగా పెళ్లికి సంబంధించిన వీడియోలు ఎక్కువగా నెట్టింట సందడి చేస్తుంటాయి.
Imagine you're sitting at the wedding altar waiting for the bride, and suddenly a relative tells you that your wife has posted this reel on Instagram. pic.twitter.com/ONjQksI152
— Berlin ? (@Toxicity_______) June 24, 2025
ఈ క్రమంలో ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో.. ఒక నవవధువు తన గదిలో ఫ్రెండ్స్ తో కలిసి బీర్లు తాగుతూ, మరో చేతిలో సిగరెట్ పెట్టుకుని హల్ చల్ చేస్తుంది. ఆ గదిలో మరికొంత మంది అమ్మాయిలు, బాయ్స్ కూడా ఉండటం కన్పిస్తుంది. వారంతా లిక్కర్ మత్తులో తాగి తందానాలు ఆడుతున్నారు. మొత్తంగా మత్తులో తూలుతూ రచ్చ రచ్చ చేస్తున్నారు.
నవ వధువు కనీసం.. తన పెళ్లి ఉందని కూడా మర్చిపోయి వారికి కంపెనీ ఇస్తుంది. ఈ క్రమంలో కొంత మంది నవవధువు తతంగం చూసి నోరెళ్ల బెడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.
పబ్లిక్గా ఇలా చేస్తుందంటే.. పెళ్లి తర్వాత ఇంట్లోనే దుక్నాం పెడుతుందని కూడా నెటిజన్లు షాకింగ్ కామెంట్లు పెడుతున్నారు. మరీ ఇలాంటి అమ్మాయి కోడలుగా అవసరమా.. అని మరికొంత మంది ఆ వరుడిపై ట్రోల్స్ చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









