Bulb Changing Job: బల్బు మార్చడమే అతడి పని.. నెలకు రూ.40 వేల జీతం!

Bulb Changing Job: బల్బు మార్చేందుకు నెలకు రూ.40 వేల జీతం! మీరు విన్నది నిజమే.. ఒకే ఒక్క బల్బు మార్చేందుకు ఓ వ్యక్తికి నెలకు రూ.40 వేల వేతనాన్ని ఓ కంపెనీ ఇస్తుందట. అయితే బల్బు మార్చడంలో పెద్ద పనేముంది? అంత జీతం ఆ వ్యక్తికి ఎందుకు ఇస్తున్నారో తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ చదివేయండి.   

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 10, 2022, 03:27 PM IST
Bulb Changing Job: బల్బు మార్చడమే అతడి పని.. నెలకు రూ.40 వేల జీతం!

Bulb Changing Job: ఏ కాలంలోనైనా మనం చేసే పనిని బట్టి మన పైఅధికారులు జీతాన్ని నిర్ణయిస్తారు. కానీ, కొందరికి మాత్రం ఎంత ఎక్కువ పని చేసినా.. తక్కువ జీతమే లభిస్తుంది. అదే మరికొందరికి అయితే తక్కువ పని చేసినా చాలా ఎక్కువ మొత్తంలో జీతం వస్తుంది. అలాంటి కోవకే ఈ స్టోరీ చెందినది. బల్బు మార్చేందుకు నియమించిన ఓ వ్యక్తికి నెలకు అక్షరాలు రూ.40 వేల జీతం ఇస్తున్నారట. అయితే అది భారత దేశంలో కాదు. ఎక్కడ? బల్బు మార్చే వర్కర్ కు అంత జీతం ఎందుకు ఇస్తున్నారో తెలుసుకుందాం. 

బల్బు మార్చేందుకు రూ.40 వేలు జీతం!

ఉదాహరణకు బల్బు మార్చేందుకు రూ.40 వేల జీతం అంటే ఎవరైన ఎగిరి గంతేస్తారు. కానీ, అది మామూలు విషయం కాదు. బల్బు మార్చడం చాలా తేలికైన పనే! కానీ, అంతమొత్తంలో జీతం ఇస్తున్నారంటే దాని వెనుక ఏముందో ఒకసారి ఆలోచించాల్సి ఉంటుంది. అయితే ఆ బల్బు మార్చాల్సింది ఏదైనా ఆఫీసులో లేదా అపార్టుమెంట్ లో కాదు.. దాదాపు 2 వేల అడుగుల ఎత్తున్న టవర్ పైన ఉన్న బల్బును మార్చాలి. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో చూద్దాం. 

ఏం జరిగిందంటే?

కరోనా లాక్ డౌన్ కారణంగా ఓ వ్యక్తి తాను చేస్తున్న ఉద్యోగాన్ని కోల్పోయాడు. జీవనోపాధి కోసం ఏదైనా పని చేసేకునేందుకు వెతుకులాట ప్రారంభించాడు. అంతలోనే ఓ పని దొరికింది. అది కూడా చాలా తేలికైన పని! బల్బు మార్చడానికి నెలకు రూ.40 వేలు జీతం ఇస్తామన్నారు. అయితే ఆ బల్బును 2 వేల అడుగుల ఎత్తున్న రేడియా టవర్ పై మార్చాలి. ప్రాణాలకు తెగించి చేయాల్సిన ఈ పని చేసేందుకు అంగీకరించి.. పనిలో చేరాడు. 

అయితే ఏడాదికి రెండు సార్లు మాత్రమే అతడు బల్బు మార్చేందుకు టవర్ పైకి ఎక్కుతానని చెప్పుకొచ్చాడు. టవర్ పైకి ఎక్కి బల్బు మార్చేందుకు తాను పడే కష్టాన్ని ఓ వీడియో రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇప్పటి వరకు ఆ వీడియోను లక్షలాది మంది చూశారు. ఆ వీడియోలో ఏముందో మీరూ కూడా చూసేయండి.  

Also Read: Wedding Dance Video: పెళ్ళిలో కూడా 'ఊ అంటావ మావ.. ఉఊ అంటావా మావా' గొడవేనా!

Also Read: Cat vs Crow Fight: తెలివైన వ్యూహంతో పిల్లిని మోసం చేసిన కాకులు- వీడియో వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News