Unlimited Biryani For Rs 10: ధరలు ఆకాశన్నంటుతుండగా.. బయట భోజనం తినలేని పరిస్థితి. రూ.వంద నోటు ఇస్తే కానీ కడుపునిండా తినలేని రోజులు ఇవి. ఈ రోజుల్లో రూ.10 కే తిన్నంత భోజనం అంటే పండగే కదా. అది కూడా అందరికీ ఇష్టమైన బిర్యానీ ఎంతంటే అంత అందిస్తే ఇక పండుగే. అలాంటి అవకాశం ఉంటే ఎంత బాగుంటుందని అనుకుంటున్నారా? అలాంటి అవకాశమే ఓ హోటల్ నిర్వాహకులు కల్పించగా.. బిర్యానీ ప్రియులు ఎగబడ్డారు. రూ.10 తిన్నంత బిర్యానీ అని ఆఫర్ పెట్టేయడంతో ప్రజలు బారులు తీరారు. బిర్యానీ ప్రియులు రూ.10 ఇచ్చి తినేందుకు తీవ్రంగా కష్టపడ్డారు. నిర్వాహకులు ఊహించని స్థాయిలో బిర్యానీ ప్రియులు ఎగబడడంతో గంటలోనే బిర్యానీ గిన్నెలు ఖాళీ అయ్యాయి. ఈ వార్త.. వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా విరవల్లి టోల్ ప్లాజా వద్ద ఆన్ లిమిటెడ్ హోటల్ కొనసాగుతోంది. ఈ హోటల్ నిర్వాహకులు వినూత్నంగా.. కొత్త తరహాలో వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఓ ఆలోచన చేశారు. అదే కేవలం 10 రూపాయలకే బిర్యానీ అందించాలని నిర్ణయించారు. రూ.10కే బిర్యానీ గురువారం పెట్టడంతో ఈ ప్రాంతంలో భారీగా ప్రజలు తరలివచ్చారు. రోజుకూలీ చేసుకునేవారు, పనివాళ్లతో పాటు విద్యార్ధులు ఎగబడ్డారు.
Also Read: RTC Bus Bandh: ఆర్టీసీ ప్రయాణికులకు బిగ్ షాక్.. ఆరోజు నుంచి బస్సులు బంద్
అంతేకాకుండా టోల్‌ప్లాజా వద్ద ఆగిన వాహనదారులు కూడా ఈ ఆఫర్ విషయం తెలుసుకుని హోటల్‌కు వచ్చారు. దీంతో హోటల్‌కు భారీగా తాకిడి ఏర్పడింది. బిర్యానీ తినేందుకు ఎగబడడంతో హోటల్ పరిసరాలు సందడిగా మారాయి. తీరా బిర్యానీ అందించే సమయంలో ఒక దశలో కొట్టుకునే పరిస్థితికి దారితీసింది. తలుపులు మూసి యాజమాన్యం బిర్యానీ అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే రూ.10 కే బిర్యానీ అందుకున్న వారు తమ కడుపు నింపుకుని 'బ్రేవ్' అనుకుంటూ వెళ్లిపోయారు. తక్కువ ధరకే బిర్యానీ అందించినా రుచిలో కూడా ఏమాత్రం తగ్గకపోవడంతో ప్రజలు ఆవురావురంటూ లాగించేశారు. బఠాణీలు, క్యారెట్లు, బంగాళాదుంపలు లాంటి కూరగాయలు వేసి రుచికరంగా వడ్డించారు. బిర్యానీకి రెండు రకాల కర్రీస్‌తో వడ్డించారు. అయితే ఇది ఈ ఒక్క రోజు మాత్రమేనా? రోజూ ఉంటుందా అనేది హోటల్ నిర్వాహకులు తెలపలేదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









