Viral Video: ఇదెక్కడి విడ్డూరం.. మూడు రోజులుగా శనిదేవుడి చుట్టు ప్రదక్షిణలు చేస్తున్న పిల్లి.. వీడియో వైరల్..
Maharashtra news: మహారాష్ట్రలోని శనీసింగ్నాపూర్ లో జరిగిన ఘటన ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ గా మారింది. భక్తులు ఇది కార్తీక మాసం మహాత్యం అంటూ చెప్పుకుంటున్నారు. ఈ ఆలయంకు చుట్టుపక్కల నుంచి భారీ ఎత్తున ప్రజలు వస్తున్నారు.
cat perform parikrama in shani temple video viral: మహారాష్ట్రలోని శనిసింగ్నాపూర్ ఆలయం ఎంతో ప్రత్యేకత కల్గి ఉంటుంది. ఈ గ్రామంలో ఎక్కడ కూడా ఇళ్లకు ద్వారాలు ఉండవు. ఇక్కడ చోరీలు జరుగవంట. ఇక్కడ శనిదేవుడి ప్రత్యేకంగా వెలసి భక్తులకు కొంగు బంగారంగా మారాడని చెప్తుంటారు. అందుకే ఏలినాటీ శని, అర్దష్టమ శని, శనిదోషాలతో బాధలు పడుతున్నవారు ఇక్కడకు తప్పకుండా వెళ్తుంటారు. శనీదేవుడికి తైలాభిషేకం చేసి మొక్కులు తీర్చుకుంటారు.
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం కార్తీక మాసం నడుస్తొంది. ఈ మాసంలో చాలా మంది శివ, కేశవుల్ని కొలుచుకుంటారు. శనీదేవుడు సూర్యుడి పుత్రుడు.ఆయనతల్లి ఛాయదేవీ. శనీకి సోదరుడు.. యమ ధర్మరాజు. అయితే.. శని సింగ్నాపూర్ లో తాజాగా, ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
పూర్తి వివరాలు..
శనిసింగ్నాపూర్ లోని ఒక ఆలయంలో పిల్లి చేస్తున్న పని చూసి అందరు షాక్ అవుతున్నారు. ఒక పిల్లి శనిదేవుడి విగ్రహం చుట్టు మూడు రోజులుగా విరామం లేకుండా.. ప్రదక్షిణలు చేస్తునే ఉందంట. దాన్ని ఎంత కదిలించిన కూడా అక్కడి నుంచి వెళ్లడం లేదు. దీంతో ఇది దేవుడి మహత్యం తప్ప మరోకటి కాదని అక్కడి వాళ్లు మొక్కుకుంటున్నారంట. దీంతో ఈ మాట.. అక్కడున్న వారందరికి తెలిసిపోయింది. ఆ పిల్లి.. దేవుడి విగ్రహాం చుట్టు.. తిరుగుతూ.. కనీసం గ్యాప్ కూడా ఇవ్వడంలేదు.
పిల్లి అదే పనిగా ప్రదక్షిణలు చేస్తునే ఉంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం షాక్ అవుతున్నారు.ఇది దేవుడి మహత్యం తప్ప.. మరోకటి కాదని అక్కడి వాళ్లు చెప్పుకుంటున్నారంట.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.