Cat Rare Video: బెలున్‌లో గాలి ఊదుతున్న పిల్లి.. చివరికి ఏం జరిగిందో తెలిస్తే, పడి పడి నవ్వుతారు!

Cat Rare Viral Video Watch: ప్రస్తుతం సోషల్ మీడియాలో పిల్లి బెలున్‌లో గాలి ఊదుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అయితే దీనిని చూసిన నెటిజన్స్‌ ఆశ్చర్యపోతున్నారు. దీనికి సంబంధించిన వీడియో వీరు కూడా చూడడండి..

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Mar 2, 2025, 09:10 AM IST
Cat Rare Video: బెలున్‌లో గాలి ఊదుతున్న పిల్లి.. చివరికి ఏం జరిగిందో తెలిస్తే, పడి పడి నవ్వుతారు!

Cat Rare Viral Video Watch: పెంపుడు జంతువులు అంటే అందరూ ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. అంతేకాకుండా వాటిని వివిధ రకాల ట్రైన్‌ చేసి అన్ని రకాల పనులు చేయిస్తూ ఉంటారు. అలాగే ఇవి ఒంటరిగా ఉన్న మనుషులకు మంచి మానసిక ప్రశాంతతను అందించేందుకు కూడా సహాయపడుతూ ఉంటాయి. కొంతమందికి ఈ పెంపుడు జంతువులు ఒత్తిడి నుంచి కూడా రిలీఫ్ అందించేందుకు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే చాలా మంది దీనిని దృష్టిలో పెట్టుకునే కుక్కలు, పిల్లులు, ఊడతు, పావురాలు ఇతర జంతువులు పెంచుకుంటూ ఉంటున్నారు. ఇదిలా ఉంటే అప్పుడప్పుడు పెంపుడు జంతువులకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Add Zee News as a Preferred Source

తరచుగా సోషల్ మీడియాలో కుక్కలకు సంబంధించిన వీడియోలు వైరల్‌ అవ్వడం మీరు గమనించవచ్చు. అయితే పిల్లికి సంబంధించిన ఓ వీడియో కూడా సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. ప్రస్తుతం ఈ వీడియో చూసి నెటిజన్స్‌ ఆశ్యర్యపోతున్నారు. ఇక వీడియో వివరాల్లోకి వెళితే.. ఓ పిల్లి పెద్ద చైర్‌లో కూర్చుని ఖాళీ బెలున్‌లో గాలి ఊదడం మీరు గమనించవచ్చు. పిల్లి ఆ చిన్న బెలున్‌లో గాలి ఊదుతూ పెద్దగా చేస్తుంది. అంతేకాకుండా గాలి ఊది ఊది చివరకు ఈ బెలున్‌ కూడా పగిలిపోతుంది. 

పిల్లి ఆ చిన్న బెలున్‌లో గాలి నింపి నింపి పగలగొడుతుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. అయితే ఈ వీడియో చూసిన చాలా మంది ఇది AI జనరేటేడ్‌ వీడియో అని అంటున్నారు. నిజానికి పిల్లులు అలా సోఫాలో కూర్చుని దర్జగా బెలున్‌లో గాలి ఊదలేవని.. ఇదంత ఫేక్‌ వీడియో అని కొంతమంది ఈ వీడియో కింద కామెంట్స్‌ కూడా చేస్తున్నారు. అలాగే ట్రైన్‌ చేసిన పిల్లు కూడా ఇలా చేయ్యలేవని అంటున్నారు. నిజానికి దీనిని క్లప్తంగా గమనిస్తే ఏఐ వీడియో అని మీకు కూడా అర్థమవుతుంది.  

ప్రస్తుతం ఈ వీడియోను @exlittlebeans అనే యూట్యుబ్‌ ఛానెల్‌ నుంచి పోస్ట్‌ చేశారు. ఇప్పటి వరకు ఈ ఛానెల్‌ను అనేక వీడియోలు పోస్టు చేశారు. దీనిని ఇప్పటి వరకు కొన్ని లక్షలకు పైగా మంది వీక్షించినట్లు తెలుస్తోంది. అలాగే మూడు మిలియన్లకు పైగా నెటిజన్స్‌ ఈ వీడియోను వీక్షించినట్లు సమాచారం.. అంతేకాకుండా దీనికి 5 వేలకు మందికి పైగా వారి అభిప్రాయాలను కామెంట్ల రూపంలో వ్యక్తం చేశారు. 

Also Read: Huge King Cobra Video: వీడే అసలైన మగాడ్రా బామ్మర్ది.. 10 అడుగుల కింగ్ కోబ్రాను ఉత్తి చేతులతో పట్టుకున్నాడు.. వీడియో చూశారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News