Viral Video: అపరిచితుడు మూవీ సీన్ రిపీట్.. ఇక్కడ మాత్రం దానికి రివర్స్.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..

Boy saved from electric shock video:  తమిళనాడులోని చెన్నైలో ఇటీవల మూడో తరగతి బాలుడు స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్నాడు. ఇంతలో అక్కడ వర్షం బీభత్సంగా పడుతుంది. అతను అక్కడ సారిగా కరెంట్ షాక్ కు గురయ్యాడు.  

Written by - Inamdar Paresh | Last Updated : Apr 20, 2025, 04:03 PM IST
  • చెన్నైలో షాకింగ్ ఘటన..
  • వర్షంలో విలవిల్లాడిపోయిన బాలుడు..
Viral Video: అపరిచితుడు మూవీ సీన్ రిపీట్.. ఇక్కడ మాత్రం దానికి రివర్స్.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..

Chennai man rescued boy from electrocution video: కొన్నిరోజులుగా వర్షాలు చెన్నై నగరానికి  చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పటికే వర్షాల వల్ల సాధారణ జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. ఈ క్రమంలో ప్రస్తుతం కుండ పోత వర్షాల వల్ల రోడ్ల మీద ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోయి ఉంటున్నాయి. మొత్తంగా జనాలు ఇంటి నుంచి అడుగుపెట్టేందుకు కూడా భయపడిపోతున్నారు.

Add Zee News as a Preferred Source

ఇదిలా ఉండగా.. ఇటీవల తమిళనాడులోని చెన్నైలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.   ఒక్కసారిగా భారీగా వర్షం కురిసింది. దీంత రోడ్డంతా జలమయమైపోయాయి. ఎక్కడ చూసి కూడా నీళ్లు మాత్రమే కన్పిస్తున్నాయి. దీంతో అడుగు తీసి అడుగు పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా.. ఒక బాలుడు అప్పుడు స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్నాడు. రోడ్డంతా బురదగా ఉంది.

 

అక్కడ కరెంట్ స్తంభం నుంచి వయర్ కట్ అయ్యి కింద పడింది. దీంతో ఆ ప్రదేశంలో కరెంట్ సప్లై జరిగింది. ఇది తెలియనీ బాలుడు.. అక్కడకు వెళ్లగానే కరెంట్ షాక్ తో ఒక్కసారిగా కింద పడిపోయాడు. నీళ్లలో పడిపోయి విలవిల్లాడిపోయాడు. ఈ క్రమంలో వెంటనే అక్కడి నుంచి వెళ్తున్న ఒక బైకర్ కన్నన్.. ఆ బాలుడ్ని గమనించాడు. వెంటనే బైక్ ను పక్కన పెట్టి బాలుడ్ని కాపాడే ప్రయత్నం చేశాడు.

నీళ్ల నుంచి ఆ బాలుడ్ని బట్టులు పట్టుకుని బైటకు లాగాడు. ఆ తర్వాత అతనికి మరో చోటకు తీసుకెళ్లి అతనికి సపర్యలు చేసి వెంటనే ఆస్పత్రికి తరలించాడు. దీంతో వైద్యులు సరైన సమయానికి చికిత్స చేయడంతో బాలుడు పెద్ద గండం నుంచి బైటపడ్డాడు.

Read more: Big Twist in Wedding: పెళ్లి పీటల మీద బిగ్ షాక్ .. పిల్ల అని చెప్పి తల్లితో పెళ్లి..!.. లబో దిబోమన్న వరుడు.. ఎక్కడంటే..?

మొత్తంగా ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్ లు ఆ వ్యక్తిని..నువ్వు దేవుడివి భయ్యా.. రియల్ హీరో అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.  మరికొందరు గతంలో అపరిచితుడు మూవీలో సీన్ లా ఉందని.. ఇలాంటి వర్షాలు పడినప్పుడు అధికారులు అప్రమత్తంగా ఉండాలని కామెంట్లు చేస్తున్నారు.

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News