)
Giant Python Snake Video Watch Here: సృష్టిలో మనిషికి, జంతువులకు మధ్య ఉండే అనుబంధానికి సంబంధించిన వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ఇలాంటి వీడియోనే ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ అద్భుతమైన దృష్యాలను చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఒక చిన్న పిల్లవాడు అత్యంత ప్రమాదకరమైన రెటిక్యులేటెడ్ పైథాన్‌తో ఆడుకుంటున్న దృశ్యాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అయితే, ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
సాధారణంగా పెద్దలకే ఎంతో భయాన్ని కలిగించే అత్యంత ప్రమాదకరమైన పాములను ఓ పిల్లవాడు ఏమాత్రం భయం లేకుండా దానిని తాకుతూ.. ఎంతో ఆనందంగా ఆడుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఆ చిన్నారి తన పక్కనే ఉన్న భారీ కొండచిలువను చేతులతో తడుముతూ కనిపించిన దృశ్యాలు ఇప్పుడు అందరి హృదయాలను తాకుతోంది. సాధారణంగా అత్యంత ప్రమాదకరమైన ఈ కొండచిలువ పిల్లవాడి పట్ల చాలా ప్రశాంతంగా ఉండడం చూసి అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు.
ఈ వీడియోలో అత్యంత ప్రమాదకరమైన పాము నెమ్మదిగా కదులుతూ ముందుకు వెళుతోంది.. ఆ చిన్నారి దాని కదలికలను గమనిస్తూ.. దాని వెంట వెళ్లేందుకు ఆసక్తి చూపాడు. ఈ దృశ్యాలను చూసినవారంతా ప్రకృతి పట్ల, జంతువుల పట్ల ఉన్న ప్రేమకు ఇది ఒక నిదర్శనమని భావిస్తున్నారు. అలాగే ఈ దృశ్యాలు సహజమైన అనుబంధాన్ని కూడా తెలియజేస్తుందని కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు తెలుపుతున్నారు.
ఈ వీడియో చూస్తుంటే.. పాములను భయపడకుండా అర్థం చేసుకుంటే అవి కూడా మనుషులతో కూడా స్నేహపూర్వకంగా ఉంటాయని సూచిస్తుంది. వీడియో చివరిలో, పాము గడ్డి గుండా నెమ్మదిగా ఇంటి వైపు వెళుతూ కనిపించింది.. ఈ వైరల్ అవుతున్న వీడియోను ఇప్పటి వరకు కొన్ని వేయిల మందికి పైగా సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కొంతమంది మాత్రమే ఈ వీడియోకు లైక్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి