)
Child Playing With Black Cobra Video: సాధారణంగా పాములు ఎంత ప్రమాదకరమైనవో మనం పెద్దగా చెప్పనక్కర్లేదు ఎందుకంటే పాములు దాడి చేస్తే తప్పకుండా మరణం సంభవిస్తుంది అత్యవసర చికిత్స చేయించుకుంటేనే మనుషులు బతికి బట్టకట్టే అవకాశాలు ఉన్నాయి అందుకే చాలామంది దాడి చేసిన వెంటనే వైద్య నిపుణులను సంప్రదిస్తారు. కొంతమంది ప్రధమ చికిత్స చేయించమని హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు..నిజానికి పాములతో పెట్టుకోవడం అంత మంచిది కాదు. ప్రస్తుతం చాలామంది పాములతో చెలగాటమాడుతున్నారు.. పాములను పట్టుకోవడమే కాకుండా వాటితో ఆటలాడుతున్నారు. వీటికి సంబంధించిన అనేక వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
చాలామంది పెంచుకుంటున్న పాములకు సంబంధించిన వీడియోలను కూడా ఇప్పుడు సోషల్ మీడియాలు పోస్ట్ చేస్తున్నారు. కొంతమంది పాములను పట్టుకొని వాటి కూరలను పీకి, ఇంట్లో పెంచుకుంటున్న పాముల దృశ్యాలు కూడా ఇంటర్నెట్లో షేర్ చేస్తున్నారు. తాజాగా ఓ పాముకు సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ వీడియోలో రెండేళ్లు కలిగిన ఓ చిన్న బాబు అతి ప్రమాదకరమైన నాగుపాముని పట్టుకొని అటు ఇటు ఆడుకోవడం మీరు చూడొచ్చు. ఈ పాముతో ఆ చిన్న బాబు ఎంత ఆడుకుంటున్న దాడి చేయకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆ బాబు బ్లాక్ కింగ్ కోబ్రాతో దాదాపు 20 సెకండ్ల పాటు ముట్టుకొని ఆడుకున్నాడు. అయితే ఈ వీడియోను అక్కడే ఉన్న కొంతమంది చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
సాధారణంగా బ్లాక్ కింగ్ కోబ్రాలు చాలా ప్రమాదకరమైనవని అందరికీ తెలిసిందే. అయితే ఈ బాబు ఆ కింగ్ కోబ్రా ను పట్టుకొని ఆడుకోవడం చూసి ఆశ్చర్యపోతున్నారు. అంతేకాకుండా కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు ఈ పాము పెంచుకున్నదని, మనుషులపై అస్సలు దాడి చేయదని కామెంట్లలో చెబుతున్నారు. మరి కొంతమంది అయితే ఈ పాము కోరలు తీసిందని, దీనికి అస్సలు విషం ఉండదని అంటున్నారు. ఇప్పటివరకు ఈ వీడియోను ఆరు లక్షల మందికి పైగా సోషల్ మీడియా వినియోగదారులు లైక్ చేశారు. అంతేకాకుండా కొన్ని లక్షల మందికి పైగా దీనిని వీక్షించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ వీడియోకు ఏడువేల మందికిపైగా కామెంట్లు చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook