King Cobra Videos: కింగ్‌ కోబ్రాతో స్కిప్పింగ్ చేసిన పిల్లలు.. చివరికి ఏం జరిగిందో వీడియో చూడండి!

King Cobra Viral Videos: ప్రస్తుతం సోషల్ మీడియాలో పాముతో స్కిప్పింగ్ చేస్తున్న పిల్లల వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని మారుమూల ప్రాంతాల్లో జరిగింది. ఇంతకీ ఈ వీడియోలో ఏముందో పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Mar 13, 2025, 07:21 PM IST
King Cobra Videos: కింగ్‌ కోబ్రాతో స్కిప్పింగ్ చేసిన పిల్లలు.. చివరికి ఏం జరిగిందో వీడియో చూడండి!

King Cobra Viral Videos: పాములు ఎక్కువగా అడవుల్లో లేదా ఆహారాలు కలిగిన పొలాల్లో జీవించేందుకు ఆసక్తి చూపుతూ ఉంటాయి. ముఖ్యంగా అడవుల్లో  పాములకు సంబంధించిన ఆహారం లభించలేని సమయాల్లో జనావాసాల్లోకి ప్రవేశిస్తూ ఉంటాయి. పాములు వ్యక్తుల ప్రవర్తనను బట్టి వాటి ప్రవర్తనలో మార్పులు తెచ్చుకుంటూ ఉంటాయి. వాటికి మనం ఏమైనా ప్రమాదం కలిగిస్తే అవి మనకి ప్రమాదాన్ని తెచ్చి పెడుతూ ఉంటాయి. ఒకవేళ మనం పాములపై దాడి చేస్తే అవి కూడా మనపై దాడి చేసే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో ఎక్కువగా పాములకు సంబంధించిన వీడియోలే కనిపిస్తూ ఉంటున్నాయి. నెటిజన్స్ ఎక్కువగా వీటికి సంబంధించిన వీడియోలు చూసేందుకే ఆసక్తి చెబుతున్నారు. తాజాగా కింగ్‌ కోబ్రా పాముకు సంబంధించిన ఓ వీడియో ఇంటర్నెట్లో ఊహించని స్థాయిలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ వీడియో అంతలా వైరల్ ఎందుకు అవుతుందో? దానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Add Zee News as a Preferred Source

వీడియో వివరాల్లోకి వెళ్తే కొంతమంది పిల్లలు ఆడుకోవడం మీరు గమనించవచ్చు. అయితే వారు ఆడుకుంటున్న టిప్పింగ్ తాడును చూసారా? నిజానికి ఇది స్కిప్పింగ్ తాడు కాదు ఓ పాము.. కొంతమంది పిల్లలు పాము తోక తల పట్టుకొని స్కిప్పింగ్ చేయడం మీరు గమనించవచ్చు. ఇలా పిల్లలు ఆ పాముతో దాదాపు 20 నుంచి 30 నిమిషాల పాటు ఆడుకున్నట్లు తెలుస్తోంది. దీనిని అక్కడే ఉన్న కొంతమంది స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీడియో వైరల్ గా మారింది. ఏకంగా ఆ పిల్లలు అతి ప్రమాదకరమైన పాముతో స్కిప్పింగ్ చేయడం ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఆ పిల్లలు అంత ధైర్యంగా స్కిప్పింగ్ తాడుల పాముని పట్టుకొని ఆడుకోవడం ఇప్పుడు ఇంటర్నెట్లో పెద్ద చేర్చగా మారింది. ఆ పాము చనిపోయినప్పటికీ అలా ఆడుకోవడం ఎంత మాత్రం సరైనది కాదని ఇంటర్నెట్లో పెద్ద వివాదానికి దారితీస్తూ వస్తోంది. వన్యప్రాణుల సంరక్షణ శాఖ ఇప్పటికే ఈ వీడియో పై స్పందించినట్లు కూడా తెలుస్తోంది. అతి త్వరలోనే వారిపై చర్యలు కూడా తీసుకోబోతున్నట్లు సమాచారం. నిజానికి అంత ప్రమాదకరమైన పాముతో స్కిప్పింగ్ చేయడం కొంత సాహసం అనే చెప్పవచ్చు. పాములు పట్టే అలవాటు ఉంటే ఇలా ఆడుకోవడం సులభమని కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు చెబుతున్నారు. ఏది ఏమైనా పాములతో ఇలా ఆడుకోవడం చాలా డేంజర్ అని మరికొంతమంది అంటున్నారు.

ప్రస్తుతం ఈ స్నేక్ స్కిప్పింగ్ కు సంబంధించిన ఘటన క్వీన్స్‌ల్యాండ్‌లోని వూరాబిండాలో ఆస్ట్రేలియన్ ఆదివాసి పల్లెలో జరిగినట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా ఇది ఆస్ట్రేలియాలో పెద్ద నేరంగా కూడా పరిగణిస్తారట. ప్రభుత్వం ఇలా చేసిన వారిపై ఆరు లక్షలకు పైగా జరిమానా విధించే అవకాశాలు కూడా ఉన్నట్లు సమాచారం. ఇలా షేర్ చేసిన వీడియోను ఇప్పటివరకు 15 లక్షల మందికి పైగా సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా చాలామంది ఈ వీడియో పై కామెంట్ల రూపంలో స్పందించారు. కొంతమంది అయితే ఈ వీడియో చూసి షాక్ ఐతున్నట్లు తెలిపారు.

Also Read: Huge King Cobra Video: వీడే అసలైన మగాడ్రా బామ్మర్ది.. 10 అడుగుల కింగ్ కోబ్రాను ఉత్తి చేతులతో పట్టుకున్నాడు.. వీడియో చూశారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

 

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News