childrens playing skipping rope with dead snake video: చాలా మంది పాములు, కొండ చిలువల్ని చూడగానే దూరంగా పారిపోతారు. అసలు.. పాములు, కొండ చిలువల పేరు ఎత్తడానికి సైతం గజ గజ వణికిపోతారు. నార్మల్ గా పాములు, కొండ చిలువలు చెట్లు ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో ఉంటాయి. ఎలుకల వేటలో జనావాసాల్లోకి వస్తాయి. ఇటీవల రోడ్ల మీద పాములు, కొండ చిలువలు వచ్చిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. మొత్తంగా పాములు, కొండ చిలువల వీడియోలు చూసేందుకు నెటిజన్లు సైతం ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు.
అయితే.. పాములు, కొండ చిలువకు ఎక్కడైన కన్పిస్తే చాలా మంది స్నేక్ సొసైటీ వాళ్లకు సమాచారం ఇస్తారు. కానీ మరికొందరు మాత్రం వాటిమీద తమ శాడిజం చూపిస్తారు. పాములు, కొండ చిలువల వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. ప్రస్తుతం ఒక వీడియో మాత్రం తెగ ట్రెండింగ్ మారింది.దీనిలో కొంత మంది యువకులు.. ఒక కొండ చిలువను పట్టుకుని దానితో స్కిప్పింగ్ ఆడుతున్నారు.
Australian Aboriginal children use dead python as a skipping rope in Woorabinda, Queensland pic.twitter.com/1VfIdL3hIs
— Clown Down Under ? (@clowndownunder) March 10, 2025
అదేదో..తాడులాగా.. ఇరువైపులా పట్టుకుని మరీ స్కిప్పింగ్ ఆడుతున్నారు. పిల్లలు సరదాగా కేకలు వేస్తు కొండ చిలువతో స్కిప్పింగ్ ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. వారి లక్ ఏంటంటే.. అది ప్రాణాలతో లేదు. ఈ టన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. సెంట్రల్ క్వీన్స్‌ల్యాండ్‌లోని రాక్‌హాంప్టన్ నుండి రెండు గంటల దూరంలో ఉన్న ఆస్ట్రేలియాలోని వూరాబిండా నుండి వచ్చిన ఈ వీడియోలో కొంత మంది పిల్లలు కొండ చిలువను తమ చేతిలో పట్టుకున్నారు.
Read more: Viral Video: సీక్రెట్‌గా ప్రియురాలితో హొలీ ఆడిన ప్రియుడు.. చివరలో ఆ పని కూడా.!. వీడియో వైరల్..
దాన్ని స్కిప్పింగ్ తాడులా ఎందుకు వాడకూడదనుకున్నారో ఏంటోకానీ.. వెంటనే దాన్ని ఇద్దరు పిల్లలు ఇరువైపులా పట్టుకున్నారు. మరికొందరు స్కిప్పింగ్ చేస్తు రచ్చ చేశారు. ఆతర్వాత దాన్ని దూరంగా విసిరేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. నెటిజన్లు దీన్నిచూసి ఏంట్రా ఇది అంటూ షాక్ అవుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









