Choti Monalisa in Ujjain video viral: ప్రయాగ్ రాజ్ కుంభమేళాలో కోట్లాది మంది పుణ్యస్నానాలు ఆచరించారు. కుంభమేళ త్రివేణి సంగమంలో చాలా మంది స్నానాలు ఆచరించి పండగ చేసుకున్నారు. ఈసారి కుంభమేళ పుణ్యామా..అని చాలా మంది జీవితాలు మారిపోయాయని చెప్పుకొవచ్చు. కుంభమేళలకు వచ్చిన వాళ్లు కొంత మంది ఓవర్ నైట్ లో స్టార్ లు మారిపోయారు. ఐఐటీ బాబా, కుంభమేళ మోనాలీసా, అఘోరీలు తెగ వార్తలలో నిలిచారు.
వీరిలో కుంభమేళ మోనాలీసా మాత్రం ఫెమస్ అయిపోయి.. ఏకంగా బాలీవుడ్ సినిమాలో హీరోయిన్ గా చాన్స్ కొట్టేసింది. అయితే.. ప్రస్తుతం మోనాలీసాకు సినిమాల్లో నటించడంలో ట్రైనింగ్ ఇస్తున్నారు. మోనాలీసాను గతంలో చాలా మంది ట్రోల్స్ చేశారు . బాలీవుడ్ దర్శకుడు మోనాలీసాను ట్రాప్ చేశాడని కూడా వార్తలు వచ్చాయి. కానీ మోనాలీసా వాటిని ఖండించింది. మోనాలీసా తన తల్లికి బంగారం చైన్ కు కూడా కానుకగా ఇచ్చింది.
ఈ క్రమంలో ప్రస్తుతం ఉజ్జయినీలో అచ్చం మోనాలీసా భోంస్లే మాదిరిగా ఉన్న ఛోటీ కుంభమేళ తెగ రచ్చ చేసింది. ఆమె ముఖం, ఫెస్ కట్ అచ్చం.. కుంభమేళ వైరల్ యువతి మోనాలీసాను పోలీ ఉన్నాయి. ఈ క్రమంలో అక్కడున్న వారు.. ఈమెను ఛోటీ మోనాలీసా అంటూ ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
దీన్ని చూసిన నెటిజన్లు ఛోటీ మోనాలీసా దొరికిపోయిందోచ్.. అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ఈమె కుంభమేళ బ్యూటీ మోనాలీసా మినీ ప్రింట్ లా ఉందని కామెంట్లు చేస్తున్నారు. ఉజ్జయినీలో ఛోటీ మోనాలీసా సైతం.. పూసలు అమ్ముకుంటూ ఉండటం కన్పిస్తుంది. మొత్తంగా ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.









