Cobra and peacock fighting each other video: సాధారణంగా పాములకు కొన్ని జంతువులతో అస్సలు పడదు. మెయిన్ గా ముంగీస, గద్ద, కుక్కలు, నెమళ్లు అంటే పాములకు అస్సలు పడదు. ఇవి బద్ద శత్రువులు. పొరపాటున ఒకదానికి మరోకటి ఎదురైతే ఇంకా అంతే సంగతులు. పాముల వీడియోలు ఇటీవల నెట్టింట ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి. నెటిజన్ లు సైతం పాముల వీడియోలను చూసేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వెరైటీగా ఉన్న పాముల వీడియోలు వైరల్ అవుతున్నాయి.
సోషల్ మీడియాలో పాముల వీడియోలు కొన్ని ఆశ్చర్యకరంగా ఉంటే..మరికొన్ని అత్యంత భయానకంగా ఉంటున్నాయి. మొత్తంగా ప్రస్తుతం అయితే.. ఒక పాము, నెమల వంద అడుగుల లోతైన బావిలో పడిపోయాయి. ఇంకెం రెండు కూడా భీకరంగా ఒకదానితో మరోకటి పోరాటంకు దిగాయి. నువ్వెంత అంటే...నువ్వెంత అన్న విధంగా అవి గొడవలకు దిగాయి.
ఈ క్రమంలో పాము, నెమలి కొట్టుకొవడంతో అక్కడున్న రైతులు ఆ బావి దగ్గరకు వచ్చి చూశారు. బావిలోపల లైట్లు పెట్టి చూడగా.. పాము, నెమలి కన్పించింది. వెంటనే స్నేక్ సొసైటీ వాళ్లకు సమాచారం ఇచ్చారు. అతను ఎంతో చాకచక్యంగా బావిలోకి దిగి.. తొలుత నెమలిని కాపాడాడు.
ఆ తర్వాత పామును కూడా పట్టుకుని దాన్ని కూడా అడవిలోకి వదిలేశాడు.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. బాబోయ్.. ఎంత ఘోరంగా కొట్టుకుంటున్నాయ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం.. పాపం.. వాటి ప్రాణాలు కాపాడిన వ్యక్తి మాత్రం గ్రేట్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.









