Cobra attacks on snake catcher video viral: పాముల వీడియోలు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్గా మారుతుంటాయి. నెటిజన్లు కూడా ఇటీవల కోబ్రాల వీడియోలు ఆసక్తిగా చూస్తున్నారు. అందుకే ఎక్కడ ఎలాంటి పాములు కన్పించిన వెంటనే తమ ఫోన్ లలో రికార్డులు చేసి సోషల్ మీడియాలో డంప్ చేస్తున్నారు. దీంతో అది కాస్త వైరల్గా మారుతున్నాయి. ఈ క్రమంలో పాములు ఇటీవల ఇళ్లలోకి దూరి వస్తున్నాయి. ముఖ్యంగా చల్లగా ఉండే ప్రదేశాల్లో కోబ్రాలు నివాసం చేస్తాయి. ఎలుకలుఉన్న చోట పాములు ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు.
మొత్తంగా పాముల కాటుకు గురయ్యే బదులు జాగ్రత్తలు పాటిస్తే కోబ్రాల నుంచి రిలీఫ్ పొంద వచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఒక కోబ్రా వీడియో నెట్టింట వైరల్గా మారింది. దీనిలో భారీ సర్పం పడగ విప్పి బుసలు కొడుతుంది. అంతేకాకుండా అది కోపంగా అందరి వైపు చూస్తుంది.
వెంటనే అక్కడి వారు స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన స్నేక్ క్యాచర్ లు పామును చాకచక్యంగా పట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ అదిమాత్రం పలు మార్లు కాటు వేసేందుకు రెడీ అయిపోయింది. కోపంగా పడగవిప్పి కాటు వేసింది. దీంతో అక్కడి వారు దూరంగా పారిపోయారు.
Read more: Snake video: వామ్మో.. షెల్ఫ్‌లో కూర్చుని బుసలు కొడుతున్న నాగుపాము.. షాకింగ్ వీడియో..
నాగుపాము కోపంగా అక్కడున్న వారిపై దాడిస్తున్న ఘటనను అక్కడి వారు వీడియోలు తీశారు దాన్ని కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్గా మారింది. చాలా సేపు తర్వాత కోబ్రాను స్నేక్ క్యాచర్ చాకచక్యంగా పట్టుకుని అడవిలొ వదిలేశాడు.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది.









